సభాసంఘాన్ని ఆహ్వానిస్తున్నా: పొన్నాల | ponnala laxmaiah welcomes to House community over assembly sessions | Sakshi
Sakshi News home page

సభాసంఘాన్ని ఆహ్వానిస్తున్నా: పొన్నాల

Published Fri, Nov 28 2014 1:56 AM | Last Updated on Sat, Sep 2 2017 5:14 PM

సభాసంఘాన్ని ఆహ్వానిస్తున్నా: పొన్నాల

సభాసంఘాన్ని ఆహ్వానిస్తున్నా: పొన్నాల

సాక్షి, హైదరాబాద్: ‘రాంపూర్ వద్ద ఉన్న  నాభూములకు సంబంధించి ఎలాంటి అక్రమాలు జరగలేదు. ప్రభుత్వం ఈ అంశంపై వేసిన సభా సంఘాన్ని ఆహ్వానిస్తున్నా..’ అని  పీసీసీ అధ్యక్షుడు పొన్నాలలక్ష్మయ్య పేర్కొన్నా రు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం రాంపూర్ వద్ద పొన్నాల దళితుల అసైన్డు భూములను కబ్జా చేశారని వచ్చిన ఆరోపణలపై బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో వాడివేడి చర్చ జరగడం, అసైన్డు, ఇతర భూముల అన్యాక్రాంతాన్ని నిగ్గు తేల్చేందుకు సభాసంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పొన్నాల స్పందిస్తూ.. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే ఇదంతా చేస్తున్నారని, సభా సంఘానికి అన్ని వివరాలు అందిస్తానన్నారు.
 
 రాజకీయకక్ష సాధింపులకే..
 ప్రభుత్వం కావాలనే పొన్నాలపై రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని కాంగ్రెస్‌కు చెందిన దళితనేతలు మల్లురవి, చంద్రశేఖర్, విజయరామారావు, అద్దంకి దయాకర్ ఆరోపిం చారు.  సభాసంఘాన్ని ఆహ్వానిస్తున్నామని, అయితే, ఎన్నిరోజుల్లో లెక్కలు తేలుస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement