ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఈనెల 16న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఇందులో పోస్టల్ బ్యాలెట్‌లను కూడా లెక్కిస్తారు. తొలుత పోస్టల్ బ్యాలెట్‌లను లెక్కించి, ఆ తర్వాత 30 నిమిషాలకు ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభిస్తారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పత్రాల కోసం ప్రత్యేకమైన బల్లలు ఏర్పాటు చేస్తారు. ఈ లెక్కింపును రిటర్నింగ్ అధికారి చూస్తారు. ఓటరు నుంచి వచ్చే ప్రతి పోస్టల్ బ్యాలెట్ పత్రం ఫారం 13 బిలో లోపల ఉంచిన కవర్‌లో ఉంటుంది. నిర్ణీత సమయంలో వచ్చిన పోస్టల్ బ్యాలెట్ పత్రాలను ఫారం 13-సి కవర్‌లను ఒకదాని తర్వాత ఒకటి రిటర్నింగ్ అధికారి తెరుస్తారు.
ప్రతి అభ్యర్థికి వచ్చిన ఓటును లెక్కించి ఫారం -20 ఫలితం షీట్‌లో నమోదు చేసి అభ్యర్థులు, ఎలక్షన్ ఏజెంట్లకు సమాచారం ఇవ్వాలి. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఫైనలైజ్ చేయకుండా ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈవీఎం లెక్కింపులలో అన్ని రౌండ్ల ఫలితాలను ప్రకటించరాదు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపైనే విజయం నిర్ధారణ అయ్యే సమయంలో... వాటిని పునఃధ్రువీకరణ చేసుకోవాల్సి ఉంటుంది. పరిశీలకుడు, రిటర్నింగ్ అధికారి సమక్షంలో పనికిరావని తిరస్కరించిన అన్ని పోస్టల్ బ్యాలెట్‌పత్రాలను, ప్రతి అభ్యర్థి పక్షాన లెక్కింప బడిన ఓట్లను మరోసారి పరిశీలించి సరిచూసుకోవాలి.
తిరస్కరణ ఇలా...
పోస్టల్ బ్యాలెట్‌పై ఓటు నమోదు కానప్పుడు..
ఒక అభ్యర్థికి కంటే ఎక్కువ మందికి ఓటు వేసినప్పుడు..
తప్పుడు బ్యాలెట్ పత్రమైతే...
నిజమైన బ్యాలెట్ పత్రమని నిశ్చయించడానికి వీలులేకుండా చిరిగి, చెడిపోయినప్పుడు..
రిటర్నింగ్ అధికారి ఓటరుకు పంపిన కవరులో తిరిగి పంపకపోయినట్లయితే...
పోస్టల్ బ్యాలెట్‌లో ఏ అభ్యర్థికి ఓటు వేశాడో నిర్ధారణ చేసుకోలేకపోతే....
పోస్టల్ బ్యాలెట్ ఏ ఓటరు పంపించింది గుర్తించే వీలున్నా, ఇతర రాతలున్నా వాటిని తిరస్కరించవచ్చు.
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఇలా...
Published Sat, May 10 2014 3:26 AM | Last Updated on Thu, Jul 11 2019 8:26 PM
Advertisement
Advertisement