మహిళా చైతన్యానికి ‘ప్రజ్వల’ | Prajwala For Womens Dynamism | Sakshi
Sakshi News home page

మహిళా చైతన్యానికి ‘ప్రజ్వల’

Published Wed, Jun 27 2018 2:26 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

Prajwala For Womens Dynamism - Sakshi

సునీత రామకృష్ణన్‌

చందంపేట (దేవరకొండ) : అవినీతి.. అరాచకా లు.. చిన్నపిల్లలపై లైంగిక దాడులు ఇవన్నీ ప్రస్తు త సమాజంలో మనం నిత్యం చూస్తున్న సత్యాలు. వాటికి వ్యతిరేకంగా పోరాడుతూ ఒకటి కాదు రెం డుకాదు దేశ వ్యాప్తంగా 20 వేల మందిని కాపాడింది డాక్టర్‌ సునీతా రామకృష్ణన్‌. ఈమె ప్రజ్వల అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి సేవా కార్య క్రమాలను చేపడుతూ ఆడ పిల్లల అమ్మకాలు, బ్రూణహత్యలు, వెట్టిచాకిరి, పిల్లల అక్రమ రవా ణాను అడ్డుకుంటోంది. 

జిల్లాలో ముమ్మరంగా కార్యక్రమాలు

గత 22 ఏళ్లుగా రాష్ట్రంలో ఆడ పిల్లలను కాపాడుతూ వారికి మనోధైర్యాన్ని ఇస్తున్న ఆమె సేవలు ఇప్పుడు నల్లగొండ జిల్లాలో ముమ్మరంగా సాగుతున్నాయి. ఆమె ఏర్పాటు చేసిన ప్రజ్వల సంస్థ ఆధ్వర్యంలో నేరడుగొమ్ము మండలంలోని పలు గ్రామాల్లో మూడు రోజుల పాటు అవగాహన సదస్సులు నిర్వహించారు. అలాగే మారుమూల చం దంపేట మండలంలో కూడా ఆ సంస్థ ఆధ్వర్యం లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు.

1996లో ఏర్పాటు

1996లో డాక్టర్‌ సునీతా రామకృష్ణన్‌ ప్రారంభించి న ఈ సంస్థ అప్పటి నుంచి ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. దాతల సహకారంతో సొంత కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఆమె గురించి ‘సాక్షి’ దినపత్రిలో పలుమార్లు కథనాలు రావడంతో పలువురు పాఠకులు స్పందిస్తూ హైదరాబాద్‌లోని తుక్కుగూడలో  ప్రజ్వల సంస్థ కార్యాలయాని కి ఆర్థిక సహకారం అందించారు. బ్రూణ హత్యలు, పిల్లల అమ్మకాలు, పిల్లల అక్రమ రవాణాల నివారణపై అవగాహన కల్పిస్తోంది.

సేవలు విస్తృతం చేస్తాం

ఆడ పిల్లల రక్షణ, భ్రూణ హత్యలు, శిశు విక్రయాలు తదితర అంశాలపై ప్రజ్వ ల ఆధ్వర్యంలో 22 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా. మోసపోయిన బాలికలకు ఉచి త శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. షెల్టర్‌ హోం, ఎమర్జెన్సీ షెల్టర్‌ హోం ద్వారా ఆశ్రయం కల్పి స్తున్నాం.  సేవలను విస్తృతం చేస్తాం.\

–  డాక్టర్‌ సునీతా రామకృష్ణన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement