నేటి నుంచి మూడు రోజుల పాటు జహీరాబాద్‌లో కూటములు
హాజరు కానున్న అంతర్జాతీయ సువార్తికులు బ్రదర్ ఎం.అనిల్‌కుమార్
గురువారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన క్రైస్తవులు
జహీరాబాద్: స్థానిక బాగారెడ్డి స్టేడియంలో ఈనెల 5నుంచి 7వ తేదీ వరకు నిర్వహించనున్న ఏసుక్రీస్తు ఆశీర్వాద పండుగల కోసం భారీ ఏర్పాట్లు చేశారు. కార్యక్రమాల కోసం స్టేడియంలో భారీగా ఫ్లడ్‌లైట్లను, వేదికను ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటు జరగనున్న ఏసుక్రీస్తు ఆశీర్వాద పండుగలకు వాక్యోపదేశకులుగా అంతర్జాతీయ సువార్తికులు బ్రదర్ ఎం.అనిల్‌కుమార్ హాజరుకానున్నారు. ప్రతి రోజు సాయంత్రం 5 గంటలకు కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఈ సందర్భం గా క్రిస్మస్ సందేశం, ఆరాధన, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ కూటములకు క్రైస్తవులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున వాహనాలు నిలిపేం దుకు ప్రత్యేకంగా స్థలం కేటాయించారు.
పట్టణంలో క్రైస్తవుల భారీ ర్యాలీ
మూడు రోజల పాటు నిర్వహించతలపెట్టిన ఏసుక్రీస్తు ఆశీర్వాద పండుగలను పురస్కరించుకుని గురువారం జహీరాబాద్ పట్టణంలో క్రైస్తవులు భారీ ర్యాలీ నిర్వహించారు. అంతర్జాతీయ ప్రసంగీకులు బ్రదర్ అనిల్‌కుమార్ ఆధ్యాత్మిక సందేశాలు ఇవ్వనున్న నేపథ్యంలో సభలు విజయవంతం కావాలని కోరుతూ మెథడిస్ట్, సెవెంత్‌డే సంఘాలతో పాటు ఇండిపెండెంట్ చర్చిల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అల్లీపూర్‌లోని మెథడిస్ట్ సెంట్రల్ చర్చి నుంచి ప్రారంభమైన ర్యాలీలో క్రైస్తవులు భారీగా పాల్గొన్నారు. మోటారు సైకిళ్లు, ఆటోలు, కార్లు, వ్యాన్‌లతో కూడా ర్యాలీ నిర్వహించారు. 65వ నంబరు జాతీయ రహదారి, బ్లాక్‌రోడ్డు, శ్రీనివాస్ థియేటర్‌ల మీదుగా బాగారెడ్డి స్టేడియం గ్రౌండ్‌కు చేరుకున్నారు.
ర్యాలీలో యువతీ యువకులు సంగీత వాయిద్యాలతో క్రీస్తును ఘన పరుస్తూ భక్తి గీతాలు ఆలపించారు. అనంతరం గ్రౌండ్‌లో మానవహారం నిర్మించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మూడు రోజుల పాటు నిర్వహించనున్న పండుగలో బ్రదర్ అనిల్‌కుమార్, దైవ సందేశాలను అందిస్తారని మీడియా ఇన్‌చార్జి బ్రదర్ నోముల మాణిక్యరావు పేర్కొన్నారు. శనివారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు యవనస్తుల ప్రత్యేక కూడిక జరుగుతుందన్నారు. ర్యాలీలో క్రైస్తవ సంఘకాపరులతో పాటు యూత్ లీడర్స్ బ్రదర్ స్టాలిన్, నవీన్, శరీన్, నిరంజన్, బాబి, సన్నిలు పాల్గొన్నారు.
ఆశీర్వాద పండుగలకు సర్వం సిద్ధం
Published Thu, Dec 4 2014 11:00 PM | Last Updated on Wed, Apr 3 2019 4:08 PM
Advertisement
Advertisement