ఆదిమ మానవుల ఆనవాళ్లు
‘గుండ్లపోచంపల్లి’లో వేల ఏళ్ల క్రితం సంచరించినట్లు చిత్రాలు
గుట్టలపై జంతువుల బొమ్మలు
మేడ్చల్: రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లి పరిధిలోని అటవీ ప్రాంతంలో వేల సంవత్సరాల క్రితం ఆదిమ మానవులు సంచరించిన ఆనవాళ్లు కనిపించాయి. గ్రామస్తుడు, పురావస్తు శాఖ స్కాలర్ సారుుకృష్ణ ఆదివారం ఈ విషయం ‘సాక్షి’కి వివరించారు. గుండ్లపోచంపల్లి శివారులో దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. సారుుకృష్ణ ఆరు నెలలుగా అడవిలో పర్యటించి వేల ఏళ్ల క్రితం ఆదిమ వూనవుల సంచారం ఉన్నట్లుగా గుర్తించారు. రాళ్లపై ఆదిమ మానవులు చెక్కిన అటవీ జంతువులుచిత్రాలు కనిపించాయి.
జంతువులను వేటాడే విధానం, వేటకు ఉపయోగించిన ఆయుుధాలు చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తున్నారుు. అడవి జంతువులే జీవనాధారంగా బతికిన ఆదిమ మానవులు.. తాము నివాసవుుండే కొండరాళ్లపై వాటి చిత్రాలను రాతియుుగంలో చెక్కి ఉండొచ్చని సాయికృష్ణ వివరించారు. వేల సంవత్సరాల క్రితం గుండ్లపోచంపల్లి ఆదిమ మానవులు అటవీ ప్రాంతంలో సంచరించేవారని, దానికి సంబంధించిన ఆనవాళ్లు వెలుగు చూస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ విషయూన్ని పురావస్తు శాఖకు తెలియుజేసినట్లు ఆయున తెలిపారు.