Primitive humans
-
ఆధునిక మానవుని పుట్టుకపై అధ్యయనం..మనది ఒకే మూలం కాదట
ఆధునిక మానవుని మూలాలు ఎక్కడున్నాయి? ఆఫ్రికా అన్నది అందరూ చెప్పే సమాధానం. తొలి మానవులు అక్కడే పుట్టి, అక్కణ్నుంచే ప్రపంచమంతా వ్యాపించారని దశాబ్దాలుగా వింటూ వస్తున్నాం కూడా. అంతవరకూ నిజమే అయినా మనమంతా ఒకే ఆదిమ జాతి నుంచి పుట్టుకొచ్చామన్న సిద్ధాంతం మాత్రం తప్పంటోంది ఓ తాజా అధ్యయనం. మన మూలాలు ఆఫ్రికాలోని కనీసం రెండు విభిన్న జాతుల్లో ఉన్నాయని చెబుతోంది. కనుక ఆధునిక మానవుని జన్మస్థలం ఫలానా అంటూ ఇదమిత్థంగా తేల్చి చెప్పలేమన్నది దాని సారాంశం.. మన ఆవిర్భావానికి ఒకే మూలమంటూ లేదని తాజా అధ్యయనం ఒకటి చెబుతోంది. 10 లక్షల ఏళ్ల క్రితం ఆఫ్రికావ్యాప్తంగా ఉనికిలో ఉన్న పలు ఆదిమ మానవ జాతులు హోమోసెపియన్గా పిలిచే ఆధునిక మానవుని పుట్టుకకు కారణమని అంటోంది. ‘‘ఆ కాలంలో ఆఫ్రికాలో నివసించి, క్రమంగా ఆ ఖండమంతటా వ్యాపించి పరస్పరం కలిసిపోయిన కనీసం రెండు ఆదిమ జాతులు మన ఆవిర్భావానికి మూలం. ఆఫ్రికాలో పలు ప్రాంతాల్లో నివసిస్తున్న వారి జన్యు డేటాను లోతుగా పరిశోధించిన మీదట ఈ నిర్ణయానికి వచ్చాం’’ అని అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకులు చెబుతున్నారు. దీని వివరాలను జర్నల్ నేచర్‌లో ప్రచురించారు. ‘‘మన ఆవిర్భావానికి కారకుడైన ఆదిమ మానవులు ఒకే జాతికి చెందిన వారని మానవ వికాసంపై దశాబ్దాలుగా జరిగిన పరిశోధనల్లో చాలావరకు చెప్పుకొచ్చాయి. వారు ఆఫ్రికాలో తొలుత చెట్లపై నివసించి, అనంతరం క్రమంగా నేల మీదికి దిగారన్నది వాటి సారాంశం. కానీ ఆఫ్రికావ్యాప్తంగా మానవ ఆవాసాలకు సంబంధించిన శిలాజ, పురాతత్వ రికార్డులు ఈ వాదనతో సరిపోలడం లేదు. ఆఫ్రికాలో పలు ప్రాంతాల్లో సంచరించిన ఒకటికి మించిన ఆదిమ జాతులు వేలాది ఏళ్లపాటు పరస్పర వలసలు తదితరాల ద్వారా కలగలిసిపోయి క్రమంగా ఆధునిక మానవుని ఆవిర్భావానికి దారితీశాయన్నది మా పరిశోధనలో తేలింది. హేతుబద్ధంగా ఆలోచించినా ‘ఒకే మూలం’ సిద్ధాంతం కంటే ఇదే సమంజసంగా తోస్తోంది కూడా’’ అని పరిశోధనకు నేతృత్వం వహించిన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా జెనెటిసిస్ట్ డాక్టర్ బ్రెన్నా హెన్ వివరించారు. ఆ ఆధారాలే ఉంటేనా...! ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులందరి మూలాలూ కచ్చితంగా 10 లక్షల ఏళ్ల నాటి ఈ రెండు ఆదిమ జాతుల్లోనే ఉన్నట్టు కచ్చితంగా చెప్పగలమని బృందం సభ్యుడైన విస్కాన్సిన్–మాడిసన్ వర్సిటీ పాపులేషన్ జెనెటిసిస్ట్ ఆరన్ రాగ్స్డేల్ అంటున్నారు. ఎలా చూసినా మనందరి జన్మస్థానం ఆఫ్రికా లోని ఒకే ప్రాంతమన్న వాదనకు కాలం చెల్లినట్టేనని ఆయన చెప్పుకొచ్చారు. ‘‘కాకపోతే 10 లక్షల ఏళ్ల నాటి మానవ శిలాజ తదితర జన్యు ఆధారాలేవీ ఇప్పటిదాకా మనకు దొరకలేదు. లేదంటే ఆధునిక మానవుని (హోమోసెపియన్) ఆవిర్భావం, విస్తరణ తదితరాలపై ఈ పాటికే మరింత స్పష్టత వచ్చేది’’ అన్నారాయన. ఇలా చేశారు... డాక్టర్ హెన్ సారథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశల్లోని ప్రఖ్యాత సంస్థలకు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనంలో పాలుపంచుకున్నారు. ఆఫ్రికాలోని పలు ప్రాంతాలకు చెందిన 290 మంది జన్యు అమరికను వారు లోతుగా విశ్లేషించారు. దాంతోపాటు ఆఫ్రికాలో ఉన్న భిన్న జాతుల వారి డీఎన్ఏను ఇందుకు ఎంచుకున్నారు. పశ్చిమ ఆఫ్రికాలో సియెరా లియోన్‌లో నివసించే మెండే రైతు జాతి, ఇథియోపియాలో ఆదిమ వేటగాళ్ల నుంచి రూపాంతరం చెందిన గుముజ్ జాతి, అమ్హరాగా పిలిచే అక్కడి రైతులతో పాటు నమా అనే దక్షిణాఫ్రికాలోని వేటగాళ్ల సంతతి నుంచి డీఎన్ఏ నమూనాలను సేకరించారు. వాటిలోని వైవిధ్యాన్ని బట్టి లక్షల ఏళ్ల క్రితం ఆ డీఎన్ఏలు ఎలా ఉండేవో, ఇన్నేళ్ల పరిణామక్రమంలో ఏ విధంగా మారుతూ వచ్చాయో అత్యాధునిక సాఫ్ట్వేర్ ఆధారంగా సిమ్యులేషన్ విధానంలో ఆవిష్కరిస్తూ వచ్చారు. ఇప్పటిదాకా లభించిన అతి పురాతన మానవ శిలాజం (3 లక్షల ఏళ్ల నాటిది) ఆఫ్రికాకు చెందినదే. అంతేగాక అతి పురాతన రాతి పనిముట్లు కూడా అక్కడే దొరికాయి. ప్రధానంగా ఈ రెండింటి ఆధారంగానే ఆఫ్రికానే మన జన్మస్థానమని గత అధ్యయనాల్లో చాలావరకు నిర్ధారణకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆఫ్రికావాసుల డీఎన్ఏను బ్రిటిష్ వారి డీఎన్ఏతోనూ, క్రొయేషియాలో దొరికిన దాదాపు 50 వేల ఏళ్ల నాటి మన పూర్వీకుడైన నియాండర్తల్ మానవుని డీఎన్ఏతోనూ పోల్చి చూశారు. ఆఫ్రికావ్యాప్తంగా ఒకటికి మించిన ఆదిమ జాతులు వేల ఏళ్ల క్రమంలో తమలో తాము కలిసిపోయిన ఫలితంగానే మనం పుట్టుకొచ్చామని తేల్చారు. కనీసం రెండు ప్రధాన ఆదిమ జాతులు మన ఆవిర్భావానికి మూల కారకులని డాక్టర్ హెన్ సూత్రీకరించారు. వాటికి స్టెమ్1, స్టెమ్2గా పేరు పెట్టారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చరిత్రను చెరిపేస్తున్నారు.. క్రీ.పూ.2 వేల ఏళ్లనాటి చిత్రకళ కనుమరుగు!
అదో గుట్ట.. దానిపై ఉన్న గుండ్లనే కాన్వాస్‌గా మలచి ఆదిమానవులు దానిపై పురివిప్పి నర్తించిన నెమలిని గీశారు.. ఘీంకరిస్తూ కదలాడిన ఏనుగును సాక్షాత్కరింపజేశారు.. భారీ అడవిదున్నలను నియంత్రించిన తమ సహచరుల వీరత్వాన్ని చూపారు. సుమారు పదివేల ఏళ్ల నాటి ఈ చిత్రాలు పాత రాతియుగం మొదలు క్రీ.పూ.2 వేల ఏళ్ల క్రితం విలసిల్లిన తొలి చారిత్రక యుగం వరకు వివిధ కాలాల్లో ఆదిమానవులు గీసినవి. కానీ ఇప్పుడు వాటిని రియల్ ఎస్టేట్ వెంచర్లు మింగేస్తున్నాయి. సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలో చారిత్రక విధ్వంసం జరుగుతోంది. హైదరాబాద్‌కు 30 కి.మీ. దూరంలోని మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలో ఆదిమానవుల కాలం నాటి చిత్రకళ కనుమరుగవుతోంది. రియల్ ఎస్టేట్ వెంచర్లలో భాగంగా ఆదిమానవులు గీసిన చిత్రాలున్న గుట్ట శిథిలమవుతోంది. ఇప్పటికే రెండు కాన్వాస్‌లు మాయమవగా మరో మూడు విధ్వంసం అంచున నిలిచాయి. వాటిని పురావస్తు శాఖ రక్షిత ప్రాంతంగా గుర్తించకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. 30 అడుగుల భారీ కాన్వాస్.. గుట్టమీద ఎక్కువ చిత్రాలున్న గుండు ఓ కాన్వాస్లాగా కనిపిస్తోంది. దాదాపు 30 అడుగుల పొడవు, 6 అడుగుల ఎత్తుతో ఈ కాన్వాస్ నిండా ఆదిమానవులు ఎరుపురంగుతో గీసిన చిత్రాలే కనిపిస్తున్నాయి. క్రీ.పూ.10 వేల ఏళ్ల నుంచి 4 వేల ఏళ్ల మధ్యలో విలసిల్లిన పాత రాతియుగం, క్రీ.పూ.4 వేల ఏళ్ల నాటి కొత్త రాతియుగం, ఆ తర్వాతి తొలి చారిత్రక యుగం.. ఇలా మూడు కాలాల్లో ఈ చిత్రాలు గీసినట్టు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. వీటిల్లో ఎక్కువగా అడవి దున్నల చిత్రాలున్నాయి. ఒక దున్న విడిగా ఉండగా, మరోచోట లావుగా ఉన్న దున్న ముందు మనిషి చేతిలో ఆయుధం పట్టుకుని నిలబడి ఉన్నాడు. దానికి ఓ పక్కన ఏనుగు చిత్రం కనిపిస్తోంది. దానికి దిగువన భారీ పింఛాన్ని విప్పిన నెమలి చిత్రం ఉంది. ఈ చిత్రం కొంత అస్పష్టంగా ఉంది. దాన్ని జిరాఫీ లేదా నీల్గాయ్ లాంటి జంతువుగా కూడా పరిశోధకులు భావిస్తున్నారు. వాటి చుట్టూ మరిన్ని చిత్రాలున్నాయి. వాటిలో పక్షులు, చెట్లు, చేపలు తదితర ఆకృతులున్నాయని అంటున్నారు. మరోపక్కన మనిషి రెండు చేతులతో రెండు భారీ జంతువుల మెడలు పట్టుకొని గాలిలో ఎత్తి పట్టుకున్నట్లు ఉంది. మరో కోణంలో చూస్తే మనుషులు చేతులను జతగా పట్టుకొని నర్తిస్తున్న అనుభూతి కూడా కలుగుతోంది. 2016లో చిత్రాల గుర్తింపు.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 80 ప్రాంతాల్లో ఆదిమానవుల చిత్రాలు వెలుగుచూశాయి. 2016లో గుండ్ల పోచంపల్లికి చెందిన సాయికృష్ణ అనే రీసెర్చ్ స్కాలర్ గ్రామానికి 2 కి.మీ. దూరంలో ఉన్న మల్లన్నగుట్ట, చిత్రాలగుట్టలో ఆదిమానవులు గీసిన చిత్రాలతో ఉన్న ఐదు ప్రాంతాలను గుర్తించారు. ఆదిమానవులు గీసిన చిత్రాల్లో ఏనుగు బొమ్మ ఉందంటే అప్పుడు, అక్కడ ఏనుగులు తిరగాడాయని స్పష్టమవుతోంది. ఇప్పటివరకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని పోతనపల్లిలో తొలి చారిత్రక కాలానికి చెందిన చిత్రాల్లో, సిద్దిపేట సమీపంలోని దాసర్లపల్లిలో చారిత్రక యుగానికి చెందిన చిత్రాల్లో ఏనుగులు ఉన్నాయి. తాజాగా గుండ్లపోచంపల్లిలో ఆదిమానవులు గీసిన చిత్రాల్లోనూ అవి కనిపించడం విశేషం. ప్రస్తుతం హైదరాబాద్ విస్తరించిన ప్రాంతంలో ఒకప్పుడు ఏనుగులు తిరిగేవనడానికి ఆదిమానవులు గీసిన ఈ చిత్రమే సాక్ష్యం. చట్టం ఏం చెబుతోంది? ప్రభుత్వ స్థలం కానప్పటికీ చరిత్రలో కీలక ప్రాధాన్యం ఉన్న ఆధారాలు ఉంటే ఆ ప్రాంతాన్ని పురావస్తు శాఖ రక్షిత ప్రాంతంగా గుర్తించే వీలుంది. పురావస్తు శాఖ పరిరక్షించాలి.. పురాతన స్థలాలు, రక్షిత కట్టడాల పరిరక్షణ చట్టం ప్రకారం చారిత్రక ఆధారాలున్న స్థలాన్ని సేకరించి రక్షిత కట్టడంగా ప్రకటించొచ్చు. లేదా ప్రైవేటు వ్యక్తుల అధీనంలోనే ఉంచుతూ దాన్ని రక్షిత కట్టడంగా ప్రకటించొచ్చు. ఇలాంటి ప్రాంతాలు ప్రమాదంలో పడ్డప్పుడు పురావస్తు శాఖ వెంటనే స్వాధీనం చేసుకొని పరిరక్షించాలి. వాటిని ధ్వంసం చేయకుండా స్థల యజమానులతో మాట్లాడాలి. – డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ అవి ధ్వంసమైతే ఆధారాలు దొరకవు.. గుండ్లపోచంపల్లిలో వెలుగుచూసిన ఆదిమానవుల చిత్రాలు అరుదైనవే. ఏనుగు, నెమలి బొమ్మలు రెండు, మూడుచోట్లనే కనిపించాయి. వాటి ఆధారంగా ఆదిమానవులకు సంబంధించి మరింత ఆసక్తి కలిగించే సమాచారం తెలుసుకునే వీలుంటుంది. అవి ధ్వంసమైతే అత్యంత విలువైన సమాచారాన్ని మనం చేజేతులా నాశనం చేసుకున్నట్టే. ప్రభుత్వం పరిరక్షణకు కదలాలి. – బండి మురళీధర్‌రెడ్డి, ఆదిమానవుల రాతిచిత్రాల నిపుణుడు -
మూలాలన్నీ ఆదిమ సమాజంలోనే!
ప్రస్తుత ఆధునిక ప్రపంచం ఈ స్థితికి చేరడానికి కారణం తరతరాల పూర్వీకులు కూడబెట్టిన జ్ఞాన సంపదే. ఆ జ్ఞానం ఆధ్యాత్మికం కావచ్చు, భౌతికం కావచ్చు. అయితే ఇప్పుడు మనం చూస్తున్నదీ, అనుభవిస్తున్నదీ మాత్రమే జ్ఞానం కాదు. ఇప్పటికీ లిపి లేని ఎందరో ఆదిమ జాతుల వారు జీవనం సాగిస్తున్నారు. వారిది మౌఖిక విజ్ఞానం. ప్రకృతితో మమేకమవ్వటం, దాని పరిరక్షణ, దానిని ఉపయోగించుకోవడంలో వారు అగ్రగణ్యులు. సోకాల్డ్ ఆధునిక సమాజాలవారు ఈ జ్ఞానాన్ని గ్రహించి మరింతగా పురోగమించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా విద్యాసంస్కృతి బహు ముఖంగా విస్తరిస్తోంది. ఈ విద్యా సంస్కృతీ వికాసానికి మూలమైన తాత్త్వికులు లిఖిత విద్యనే ప్రమాణంగా తీసుకోలేదు. భారతదేశంలో గిరిజనులు మౌఖిక జ్ఞాన సంపన్నులు. దేశీయ భాషల్లో జీవం ఉంటుంది. నేల, నిప్పు, నీరు, గాలి, ఆకాశం, చెట్టూ, పుట్టా అన్నింటి విలువలు వీరి జ్ఞానంలో ఒదిగి ఉన్నాయి. అయితే వారి నుండి మనం పూర్తి జ్ఞానాన్ని పొంద లేదు. ఆ విజ్ఞానం మన జీవితాన్ని సుసంపన్నం చేయాలంటే మౌఖిక జ్ఞాన సంపద లోతుల్లోకి మనం వెళ్ళాలి. ప్రపంచ విజ్ఞానమంతా ప్రకృతిలో దాగి ఉంది. వృక్ష, జంతు, భూగర్భ శాస్త్రముల వంటి వన్నీ విస్తృతి చెందాలంటే మానవ సమాజ జీవన వ్యవస్థల లోతుల్లోకి ఇంకా పరిశోధనలు వెళ్ళాలి. మనం మన కళ్ళముందు ఉన్నదాన్ని గ్రహించ లేక మన జీవన వ్యవస్థల్లో భాగంగా ఉన్న భాష మీద ఆధిపత్యం లేక ఉపరితల అంశాల మీదే దృష్టి పెడు తున్నాం. మనకు జ్ఞానం ఎలా కలుగుతుంది? సమస్త జ్ఞానం ఇంద్రి యానుభవం ద్వారానే సిద్ధిస్తుందా? ఈ తాత్త్విక, భౌతిక దృష్టి లోపించి ప్రయోజనవాద దృష్టి పెరిగింది. ఇది మానవులకు ఉప యుక్తం కాదు. మనిషి తప్పక వాస్త వాన్ని అంగీకరించే ధోరణి లోకి రావాలి. వాస్తవం ప్రకృతిలోనూ, ప్రాకృతిక జీవుల్లోనూ ఎక్కువ ఉంటుంది. తాత్త్విక దృక్పథం లేని వాళ్ళే భూమి పొరలను చీల్చి భూగర్భ ఖనిజాలను అమ్ముకుంటున్నారు. ప్రపంచం అంతా ఈ రోజు అస్తవ్యస్తం కావ డానికి ప్రపంచం మీద, దేశం మీదా అవగాహన లేని అవిద్యాపరుల భావనలే. మనిషి స్వార్థపరుడు కావడానికి కారణం జ్ఞాన శూన్యతే. ప్లేటో చెప్పినట్టు వృక్షత్వం భావన నుంచి చెట్టు మూలం తెలుస్తుంది. చెట్టు మూలం తెలియని వాడు దాని వేర్లు నరుకుతాడు. చెట్టు మూలం తెలియని వాడు చెట్టు పెంచడు. కాగా, చెట్టు మూలం తెలిసిన వాడు దాని ఆకులోని ఔషధ గుణాన్ని స్వీకరిస్తాడు. చెట్టుకి మానవ సమా జానికి ఉన్న అంత స్సంబంధం తెలియని వాడు జ్ఞాని కాదు. నిజమైన జ్ఞానం వస్తువుకు మనకు ఉండే అంతస్సంబంధం నుండే జనిస్తుంది. చాలామంది తన చుట్టూ ఉన్న పరిసరాల మీద అవగాహనను పెంచు కోలేదు. తాము చూడని, కనని, వినని అజ్ఞాత దైవాల మీద, తమకు అనుభవం కాని కులం మీద, తాము అనుభవించని సంపద మీదా ఆలోచనలతో జీవిస్తూ ఉంటారు. అందుకే వాళ్ళు మూఢ విశ్వాసు లుగా మారతారు. జ్ఞానానికి వారు అవరోధులు. మౌఖిక జాతుల జీవన శాస్త్రాన్ని అధ్యయనం చేయడం ద్వారానే మనం భారతదేశాన్ని సుసంపన్నం చేయగలం. అనేక జాతులలో నిక్షిప్తమైయున్న జ్ఞానాన్నీ, విద్యనీ, సంస్కృతినీ మనం అర్థం చేసుకొనే క్రమం నుండే మన దేశాన్ని మనం కాపాడుకోగలం. ఆదివాసీలు నివసించే ప్రాంతాలలో ఎంతో విలువైన ఖనిజ సంపద వుంది. ఎన్నో వృక్ష జాతులున్నాయి. గిరిజనులు ఈ ప్రకృతి సంపద పట్ల ఎంతో అవగాహన కలిగి సంరక్షించుకుంటూ ఉంటారు. ఈనాడు భారతదేశం సంక్షోభంలో వుండటానికి కారణం గిరిజనుల జ్ఞాన సంపదను అర్థం చేసుకోలేకపోవడమే. గిరిజనులు రక్షిస్తున్న అటవీ సంపదను బట్టి వారి నీతినీ, నిజాయితీనీ, వ్యక్తిత్వాన్నీ, రక్షణ స్వభావాన్నీ మనం అర్థం చేసుకోవచ్చు. గిరిజనులే నిజమైన మాన వులు. వారు ప్రతి ఆకునూ ప్రేమిస్తారు. ప్రతి జంతువు స్వభావాన్నీ అధ్యయనం చేస్తారు. మాతృస్వామిక స్వభావం గలవారు. అందుకే శాస్త్రవేత్తలు లిఖిత భాషలోనే కాదు, అలిఖిత జాతులలో కూడా జ్ఞానం వుందని చెబుతున్నారు. అరిస్టాటిల్ ప్రకృతి గురించి చెప్తూ... శుద్ధద్రవ్యం మొదటగా నాలుగు మూల పదార్థాలు – మట్టి, నీరు, గాలి, అగ్నిగా మారుతుం దన్నాడు. ఇంతవరకు అరిస్టాటిల్‌కు పూర్వులైన గ్రీకులు కనిపెట్టినవే. కాని, అతడు అయిదవ మూల పదార్థం ఈథర్ కూడా ఉంటుందని ఊహించాడు. భారతీయ భౌతికవాదులు సాంఖ్యులు భూమి, నీరు గాలి, అగ్ని, శూన్యాలను కనిపెట్టారు. ఈ శూన్యంలో కూడా ఈథర్ అనే పదార్థం ఉంటుందని నేటి భౌతికవాదులు చెప్తున్నారు. అది కొంత స్థలాన్ని ఆక్రమిస్తుందని అంటున్నారు. అన్ని వస్తువులు పంచ భూతాల నుండే ఏర్పడతాయి. పదార్థ జ్ఞానాన్ని ఆదిమ వాసులు విస్తృతంగా అర్థం చేసుకొన్నారు. దేన్నైనా జీవితావసరం మేర మాత్రమే వాడుకుంటారు. కాని సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ స్వభావం వున్న వాళ్ళే వాటిని వ్యాపార దృక్పథంతో స్వార్థం కోసం ఉపయోగించు కొంటారు. భౌతిక తత్వశాస్త్రం మొత్తం ఆదిమ జాతుల నుండే వచ్చింది. సాంఖ్య దర్శన రూపకర్త కపిలుడు దళితుడే. దళితజాతులు ఆదిమ జాతులకి దగ్గరగా వుంటాయి. గిరిజనుల్లో చాలాకాలం ప్రజలకు లిపి తెలియదు కాని, వారికి మనకంటే జ్ఞాపకశక్తి ఎక్కువగా వుండేది. వారు పాతకాలపు అద్భుత గాథలను చెప్పేవారు. వారు పోయినా ఆ గాథలు మాత్రం పోలేదు. ఆనోటా ఆనోటా ఆ గాథలు మారుతూ వుంటాయి. వాటిలో కొత్త సంగతులు చేరుతుంటాయి. నీరు పారి పారి రాళ్ళు నునుపు దేరినట్టు ఆ గాథలు రాను రాను నయం గానూ, నాజూకు గానూ అవుతూ ఉంటాయి. పరాక్రమ వంతుడైన ఒకానొక కులపెద్ద కథ కాలక్రమాన నీటికీ, నిప్పుకూ, బాణానికీ, బళ్లేనికీ భయపడని వాడూ; సింహంలాగా అడవంతా పెత్తనం చెలాయించి డేగలాగ ఆకాశంలో ఎగిరిపోయేవాడూ అయిన ఏమాయా మానవుని వీరగాథ గానో మారుతుంది. గిరిజనులు, దళితులు ఇంకా ఇతర మౌఖిక ఉత్పత్తికారులు మన సంస్కృతీ వికాసానికి, తత్వానికీ మూల ప్రకృతులు. మన కేంద్ర– రాష్ట్ర ప్రభుత్వాలే కాక, మన విశ్వ విద్యాలయాలు, పరిశోధకులు, జ్ఞానులు, విద్యావంతులు మన మూల ప్రకృతులైన ఆదిమవాసులు, దళితులను అధ్యయనం చేయాలి. ఈ నేల పుత్రుల జీవన గాథలనూ, సాంస్కృతిక వికాసాన్నీ పునర్నిర్మించుకోవడానికి దళిత గిరిజన విశ్వ విద్యాలయాలను నిర్మించుకోవలసి వుంది. లిఖితేతర సమాజం వైపు నడపడమే నిజమైన శాస్త్ర దృష్టికి మూలం. ఆ వైపు నడుద్దాం. డా.కత్తి పద్మారావు, వ్యాసకర్త దళిత ఉద్యమ నాయకులు ‘ 9849741695 -
అరుదైన మానవాకృతి స్మారకశిల గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: చేతులు చాచిన మానవరూపం మాదిరిగా కనిపిస్తున్న రాయి ఇది. పంటపొలాల్లో ఏర్పాటు చేసే దిష్టిబొమ్మలాంటిది కాదు, ఏ దేవతా శిల్పమో కూడా కాదు. ఇది పాతరాతి యుగం నాటి మానవ స్మారకశిల. ఆదిమానవులు తమ సమాధుల వద్ద నిలువురాళ్లు పాతే పద్ధతి పాటించేవారు. స్థానిక సమూహంలో ముఖ్యులుగా భావించేవారి సమాధుల వద్ద పాతే అలాంటి రాళ్లను మెన్హిర్లు అంటారు. తెలంగాణలో అలాంటి నిలువురాళ్లు చాలాప్రాంతాల్లో ఇప్పటికీ ‘సజీవం’గా ఉన్నాయి. కానీ, వాటికి మానవాకృతి అద్దిన మెన్హిర్లు మాత్రం చాలా అరుదు. ఆంత్రోపో మార్ఫిక్ ఫిగర్స్‌గా పేర్కొనే ఈ రాళ్లు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో పరిమితంగా కనిపిస్తాయి. అలాంటి అరుదైన స్మారక శిల ఇది. ఆరడుగుల ఎత్తు నాలుగున్నర అడుగుల వెడల్పు.. భువనగిరి పట్టణానికి 9 కి.మీ. దూరంలో ఉన్న కేసారం గ్రామ శివారులో దీన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కుండె గణేశ్ గుర్తించినట్టు ఆ బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. భూమిలోకి లోతుగా పాతి ఉన్న ఈ శిల భూమి ఉపరితలంలో ఆరడుగుల ఎత్తు నాలుగున్నర అడుగుల వెడల్పుతో ఉందని, గుండ్రని తల, దీర్ఘచతురస్రాకారపు ఛాతీభాగం, భుజాలు, కిందికి నడుముభాగం పోల్చుకునేలా చెక్కి ఉందన్నారు. గతంలో ఈ తరహా స్మారక శిలను జనగామ జిల్లా కొడకండ్లలో ఔత్సాహిక పరిశోధకులు గుర్తించారు. క్రీ.పూ.1,800 నుంచి క్రీ.శ.300 వరకు ఉన్న ఇనుపయుగంలో మానవ వికాసదశ అత్యున్నతస్థితికి చేరుకుందన్నది చరిత్రకారుల మాట. వ్యవసాయం బాగా నేర్చుకుని స్థిరనివాసానికి అలవాటుపడ్డ మానవుడు ఇలాంటి స్మారక శిలల ఏర్పాటుకు కూడా శ్రీకారం చుట్టారన్నది వారి అంచనా. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఇలాంటి మానవరూప స్మారకశిలలు లభించాయి. కొన్ని ప్రాంతాల్లో ఆ శిలకు పురుష, మహిళ రూపాన్ని కూడా చెక్కిన దాఖలాలున్నాయి. కొడకండ్లలో లభించిన ఇలాంటి శిలను బయ్యన్న దేవుడుగా స్థానికులు పూజిస్తుండటాన్ని కూడా పరిశోధకులు గుర్తించారు. -
ఆదిమ మానవుల ఆనవాళ్లు
‘గుండ్లపోచంపల్లి’లో వేల ఏళ్ల క్రితం సంచరించినట్లు చిత్రాలు గుట్టలపై జంతువుల బొమ్మలు మేడ్చల్: రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లి పరిధిలోని అటవీ ప్రాంతంలో వేల సంవత్సరాల క్రితం ఆదిమ మానవులు సంచరించిన ఆనవాళ్లు కనిపించాయి. గ్రామస్తుడు, పురావస్తు శాఖ స్కాలర్ సారుుకృష్ణ ఆదివారం ఈ విషయం ‘సాక్షి’కి వివరించారు. గుండ్లపోచంపల్లి శివారులో దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. సారుుకృష్ణ ఆరు నెలలుగా అడవిలో పర్యటించి వేల ఏళ్ల క్రితం ఆదిమ వూనవుల సంచారం ఉన్నట్లుగా గుర్తించారు. రాళ్లపై ఆదిమ మానవులు చెక్కిన అటవీ జంతువులుచిత్రాలు కనిపించాయి. జంతువులను వేటాడే విధానం, వేటకు ఉపయోగించిన ఆయుుధాలు చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తున్నారుు. అడవి జంతువులే జీవనాధారంగా బతికిన ఆదిమ మానవులు.. తాము నివాసవుుండే కొండరాళ్లపై వాటి చిత్రాలను రాతియుుగంలో చెక్కి ఉండొచ్చని సాయికృష్ణ వివరించారు. వేల సంవత్సరాల క్రితం గుండ్లపోచంపల్లి ఆదిమ మానవులు అటవీ ప్రాంతంలో సంచరించేవారని, దానికి సంబంధించిన ఆనవాళ్లు వెలుగు చూస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ విషయూన్ని పురావస్తు శాఖకు తెలియుజేసినట్లు ఆయున తెలిపారు.