మల విసర్జన చేశాడని బట్టలూడదీత | Private school staff over action on the kid | Sakshi
Sakshi News home page

మల విసర్జన చేశాడని బట్టలూడదీత

Published Wed, Jun 22 2016 11:39 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

మల విసర్జన చేశాడని బట్టలూడదీత - Sakshi

మల విసర్జన చేశాడని బట్టలూడదీత

బాలుడిని నగ్నంగా ఇంటికి పంపిన ప్రైవేట్ పాఠశాల సిబ్బంది

 శివ్వంపేట: మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలో నాలుగేళ్ల బాలుడిపట్ల ఓ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం అమానవీయంగా ప్రవర్తించింది. తరగతి గదిలో మలవిసర్జన చేసినందుకు గాను సిబ్బంది బాలుడి బట్టలూడదీయించి నగ్నంగా ఇంటికి పంపారు.  మండలంలోని రత్నాపూర్‌కు చెందిన మణిదీప్(4) శివ్వంపేట సువిద్య కిట్స్ ప్రైవేటు పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. మంగళవారం పాఠశాలకు వెళ్లిన విద్యార్థి దుస్తుల్లో మలవిసర్జన  చేశాడు. దీంతో పాఠశాల సిబ్బంది ఆ బాలుడి దుస్తులు ఊడదీయించారు. అనంతరం  ఆటోలో నగ్నంగా ఇంటికి పంపించారు. దీంతో కుటుంబ సభ్యులు కం గుతిన్నారు.

బుధవారం ఉదయం విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్లేందుకు గ్రామానికి వచ్చిన ఆటోను విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు అడ్డుకున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిన్నారిపట్ల అమానవీయంగా ప్రవర్తించిన పాఠశాలపై చర్యలు తీసుకుంటామని ఎంఈవో చెప్పారు. ఈ విషయమై సదరు పాఠశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ నరేశ్‌ను వివరణ కోరగా.. తాను మంగళవారం పాఠశాలకు వెళ్లలేదని, ఈ ఘటనకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement