సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ ఫీజు దందా మొదలుపెట్టింది. వ్యవసాయ సీట్లకు డిమాండ్ ఉందని, ఇతర రాష్ట్రాల్లోకి వెళుతున్నారన్న సాకుతో సీట్లు పెంచుతూ భారీ ఫీజులకు తెరలేపింది. వంద సీట్లు పెంచాలని, అందులో 75 సీట్లలో ఒక్కోదానికి ఏడాదికి లక్షన్నర రూపాయలు అదనంగా వసూలు చేయాలని నిర్ణయించింది. దీనికి సాధారణ ఫీజులు కలుపుకుంటే కోర్సు మొత్తానికి రూ.8 లక్షలకుపైగా ఖర్చు అవుతుంది. మరో 25 సీట్లను ఎన్‌ఆర్‌ఐ కోటా కింద పరిగణించి ఒక్కోదానికి ఏడాదికి లక్షన్నర ఫీజుతోపాటు ప్రవేశ సమయంలో రూ.4.76 లక్షలు (6,800 అమెరికా డాలర్లు) అదనంగా వసూలు చేయాలని నిర్ణయించింది. ఎన్‌ఆర్‌ఐ సీటు కోర్సు మొత్తానికి, సాధారణ ఫీజుతో కలిపి రూ.12 లక్షలకుపైగా ఖర్చు కానుందని వర్సిటీ వర్గాలు వివరించాయి. ఈ మేరకు వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.సుధీర్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటన జారీ చేశారు.
అకడమిక్ కౌన్సిల్ ఆమోదం...
వైస్ చాన్స్‌లర్ డాక్టర్ వి.ప్రవీణ్‌రావు అధ్యక్షతన జరి గిన వర్సిటీ 10వ అకడమిక్ కౌన్సిల్ సమావేశం పలు తీర్మానాలు చేసిందని సుధీర్‌కుమార్ తెలిపారు. విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లోని ప్రైవేటు కళాశాలల్లో అధిక మొత్తం ఫీజులు చెల్లించి బీఎస్సీ వ్యవసాయ కోర్సులను అభ్యసిస్తున్నారని, ఈ నేపథ్యంలో వర్సి టీలో మరో వంద సీట్లు పెంచాలని ప్రతిపాదించిన ట్లు పేర్కొన్నారు. 75 పేమెంట్ సీట్లు ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా భర్తీ చేస్తామని, రిజర్వేషన్ విధానం పాటిస్తామని తెలిపారు. ఈ సీట్లకు సాధారణ ఫీజుతోపాటు అదనంగా ఏడాదికి రూ.లక్షా 50 వేలు, ఎన్‌ఆర్‌ఐ కోటాలోని 25 సీట్లకు సాధారణంగా కోర్సుకు చెల్లించే ఫీజుతోపాటు ఏడాదికి రూ.లక్షా 50 వేలు అదనంగా చెల్లించాలని పేర్కొన్నారు. బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్‌కోర్సు సీట్లను 59 నుంచి 75కి పెం చుతూ నిర్ణయం తీసుకున్నామని, వర్సిటీ పరిధిలో ఉన్న పది ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో సీట్ల సంఖ్యను 330 నుంచి 220కి తగ్గిస్తున్నామని తెలిపారు. ఈ ప్రతిపాదనల్ని వర్సిటీ కౌన్సిల్ ఆమోదించిన తరు వాత ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు.
వ్యవసాయ వర్సిటీలో ఫీజుల దందా
Published Sat, May 4 2019 7:55 AM | Last Updated on Sat, May 4 2019 7:55 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment