
ప్రొఫెసర్ పీఎం భార్గవకు కన్నీటి వీడ్కోలు
సాక్షి, హైదరాబాద్:
ప్రఖ్యాత శాస్త్రవేత్త, సీసీఎంబీ వ్యవస్థాపక డైరెక్టర్ ప్రొఫెసర్ పుష్పమిత్ర భార్గ వకు పలువురు ప్రముఖులు శుక్రవారం కన్నీటి వీడ్కోలు పలికారు. హైదరాబాద్ రాయదుర్గంలో ఉన్న వైకుంఠ మహాప్రస్థానంలోని దివ్యస్థల్ విద్యుత్ దహనవాటికలో భార్గవ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. ప్రజల సందర్శనార్థం ఉదయం 8 నుంచి మధ్యా హ్నం ఒంటి గంట వరకు ఉప్పల్ ప్రశాంత్‌నగర్ లోని మనోరమ స్వగృహంలో ఆయన పార్థివదే హాన్ని ఉంచారు. భార్గవ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తంచేశారు. హైదరాబాద్ లో సీసీఎంబీ ఏర్పాటు చేయడంతో పాటు, కణజీవ శాస్త్రంలో భార్గవ చేసిన కృషి అపారమని సీఎం కొనియాడారు.
ప్రభుత్వం, రాష్ట్ర ప్రజల తరఫున భార్గవకు ఘనమైన వీడ్కోలు పలకాలన్న సీఎం ఆదేశాల మేరకు సీఎస్ ఎస్పీ సింగ్ హాజరై భార్గవకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సాయంత్రం మహా ప్రస్థానంలో ఆయన కుమారుడు మోహిత్ అంత్యక్రియ లను పూర్తి చేశారు. మహాప్రస్థానం ప్రాంగణమంతా జనవిజ్ఞానవేదిక ప్రతినిధులు, ఇతరుల నినాదాలతో మార్మోగింది. ప్రొఫెసర్ భార్గవ కూతురు వనితా భట్టా చార్య, సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా, మాజీ డైరెక్టర్లు లాల్‌జిసింగ్, బాలసుబ్రమణ్యన్, మాభూమి చిత్ర దర్శ కుడు బి.నర్సింగ్‌రావు, సీపీఐ జాతీయ నాయకుడు నారా యణ, సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం, మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు జీవన్ కుమార్, జేవీవీ నాయకుడు రమేశ్, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ, విద్యావేత్త చుక్కా రామయ్య, మాజీ ఎమ్మెల్సీ గేయానంద్, మాజీ ఎంపీ అజీజ్ పాషా, ప్రముఖ చిత్రకారుడు ఏలే లక్ష్మణ్, జీఏడీ ప్రోటోకాల్ అధికారి అరవింద్ సింగ్, హైదరాబాద్ ఇన్‌చార్జ్ కలెక్టర్ ప్రశాంతి, సికింద్రాబాద్ ఆర్‌డీఓ చంద్రకళ, షేక్‌పేట్ తహసీల్దార్ రాములు, శాంతా బయోటెక్స్ మేనేజింగ్ డైరెక్టర్ వర ప్రసాద్‌రెడ్డి, హైదరాబాద్ బెటర్ సొసైటీ అధ్య క్షుడు వేద కుమార్, కల్పనా కన్నాభిరాన్, ప్రొఫెసర్ రమా మెల్కోటే, సీసీఎంబీ మాజీ డైరెక్టర్లు మోహన్ రావు, లాల్జీటండన్, ఇతర ముఖ్యులు చందనా చక్రవర్తి, అలేఖ్య, పాశం యాదగిరి, నిమ్స్ మాజీ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు, డాక్టర్ వినయ్ కుమార్, ఎన్‌ఐసీటీ, ఐఐసీటీ, సీసీఎంబీ, ఎన్‌జీఆర్‌ఐ, హెచ్‌సీయూ పరిశోధన సంస్థల శాస్త్రవేత్తలు, వివిధ రంగాలకు చెందిన ప్రము ఖులు భార్గవ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భార్గవతో తమ సాన్నిహిత్యాన్ని వారు గుర్తు చేసుకున్నారు.