చీరలు పంపిణీ చేస్తున్న మంత్రి అజయ్‌కుమార్
సాక్షి, సత్తుపల్లి: అభివృద్ధి, సంక్షేమంలో వెనక్కి తగ్గకుండా.. ఆర్థిక మాంద్యం పరిస్థితులు ఉన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ దార్మనికత్వంతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ముందంజలో ఉంచారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. స్థానిక జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో బతుకమ్మ ఒక ఆయుధంగా పనిచేసిందని ప్రభుత్వం అధికారంలోకి రాగానే బతుకమ్మ పండగను ఆనందోత్సహాలతో జరుపుకునేందుకు బతుకమ్మల్లో కూర్చే తీరొక్క పూలల్లోని రంగులతో బతుకమ్మ చీరలను మంత్రి కేటీఆర్ సిరిసిల్ల చేనేత కార్మికులతో చేయించారని చెప్పారు.
సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శాసనసభకు సీనియర్ సభ్యుడని, ఆదర్శప్రాయుడని, సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. సత్తుపల్లి ఎమ్మెల్యేకు ప్రభుత్వంలో కీలకమైన పదవి రాబోతుందని సత్తుపల్లి మున్సిపాలిటీని అభివృద్ధిలో ముందుంచుతామన్నారు. ఇసుక కొరతతో అభివృద్ధి పనులు ఆగిన మాట వాస్తవమేనని సత్తుపల్లితో పాటు జిల్లా అంతా ఇదే పరిస్థితి ఉందని, దీనిపై అధికారులతో సమీక్షించి ఇసుక కొరతపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ బతుకమ్మ చీరలు ఇచ్చి ప్రభుత్వం మహిళలను గౌరవిస్తోందని, తెలంగాణ సంప్రదాయాలను సీఎం కేసీఆర్ గౌరవించి ముస్లింలు, క్రిస్టియన్ల పండగలకు కూడా బట్టలు, విందులు ఇస్తున్నారని చెప్పారు. సత్తుపల్లి నియోజకవర్గంలో 7 వేల మందికి బతుకమ్మ చీరలు ఇస్తున్నామన్నారు.
అనంతరం ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు మాట్లాడారు. సమావేశంలో ఖమ్మం కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్, ఖమ్మం ఆర్టీఓ కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ చీమా వెంకన్న, ఎంపీడీఓ సుభాషిణి, ఎంపీపీ హైమావతి, జెడ్పీటీసీ సభ్యుడు రామారావు, అజయ్‌కుమార్, ఆర్‌డీఓ శివాజీ, మట్టా దయానంద్‌విజయ్‌కుమార్, మురళీరెడ్డి, ముత్తారెడ్డి, రఘు, నర్సింహారావు, సత్యం, శంకర్‌రావు, హరికృష్ణారెడ్డి, కృష్ణారెడ్డి, కేశవరెడ్డి, ప్రభాకర్‌రావు, నర్సింహారావు, చాంద్‌పాషా, ఉమ, పవన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment