రబీ..రంది
ప్రభుత్వ ప్రకటనతో సందిగ్ధంలో అన్నదాతలు
నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లాలో రబీసాగు అంతగా ముందుకు సాగడం లేదు. ఆరుతడి పంటలు సాగుచేయాలన్న ప్రభుత్వ ప్రకటనతో రైతులు సందిగ్ధంలో పడ్డారు. గత రబీ సీజన్‌లో 2,27,245 హెక్టార్లలో వివిధ పంటలు సాగుకాగా, అందులో 2,00,558 హెక్టార్లలో వరిసాగు చేశారు. ఈ సీజన్‌లోనూ 2,50,000 హెక్టార్లలో వరి సాగవుతుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. అయితే సీజన్ ప్రారంభమై నలభైరోజులు అవుతున్నా, కేవలం నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లాలో రబీసాగు అంతగా ముందుకు సాగడం లేదు.
ఆరుతడి పంటలు సాగుచేయాలన్న ప్రభుత్వ ప్రకటనతో రైతులు సందిగ్ధంలో పడ్డారు. గత రబీ సీజన్‌లో 2,27,245 హెక్టార్లలో వివిధ పంటలు సాగుకాగా, అందులో 2,00,558 హెక్టార్లలో వరిసాగు చేశారు. ఈ సీజన్‌లోనూ 2,50,000 హెక్టార్లలో వరి సాగవుతుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. అయితే సీజన్ ప్రారంభమై నలభైరోజులు అవుతున్నా, కేవలం 3149 హెక్టార్టలో వివిధ పంటలు సాగయ్యాయి. గత సీజన్‌లో ఈ సమయానికి 15,000 హెక్టార్లలో వివిధ పంటలు సాగయ్యాయి. ఏఎమ్మార్పీ, నాగార్జునసాగర్ ఎడమకాల్వ ద్వారా నీటివిడుదల కొనసాగుతున్నా, సాగుకు రైతులు సుముఖంగా లేరు.
విద్యుత్ సంక్షోభంగా కారణంగా, సరిపడా కరెంట్ సరఫరా చేసే పరిస్థితులు కనిపించకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. వరికాకుండా వేరుశనగ, మొక్కజొన్న, మినుము, కంది, జొన్న తదితర మెట్టపంటలను సాగుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి సూచించింది. ఈ నేపథ్యంలో బోరుబావులు, చెరువుల్లో సమృద్ధిగా నీరున్నా వరిసాగుకు రైతులు వెనుకాముందు ఆడుతున్నారు. ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని, దానికి అవసరమైన విత్తనాలను సబ్సిడీపై ఇస్తామని ప్రభుత్వం ఓవైపు చెబుతుండగా, చెరువుల పునరుద్ధరణ పేరుతో చెరువుల్లో ఉన్న నీటిని ఖాళీచేసే అవకాశముంది. దీంతొ వరిని సాగుచేయడానికి రైతులు వెనుకంజ వేస్తున్నారు.
రైతుల ఆశలపై నీళ్లు
ఖరీఫ్‌లో ఆశించిన స్థాయిలో వరి, పత్తి దిగుబడి రాలేదు. దీంతో రైతులు రబీపైనే ఆశ పెట్టుకున్నారు. ఆయకట్టు పరిధిలో వరికి దోమపోటు కారణంగా దిగుబడి తగ్గే అవకాశముంది. దీంతోరైతులు రబీలోనన్నా కలిసి వస్తుందని సాగుకు సన్నద్ధమవుతున్న సందర్భంలో ప్రభుత్వ ప్రకటన వారి ఆశలపై నీళ్లు చల్లింది. జిల్లాలో ఆరుతడి పంటల సాగుపై రైతులకు అంతగా ఆసక్తి చూపడం లేదు. ఈ పరిస్థితుల్లో రబీలో సాగువిస్తీర్ణం గణనీయంగా పడిపోయే ప్రమాదం పొంచి ఉంది.
ఆరుతడి పంటలే మేలు : జేడీఏ నర్సింహారావు
విద్యుత్‌ను సక్రమంగా సరఫరా చేయలేమని రాష్ట్ర ప్రభుత్వమే స్పష్టంగా ప్రకటించింది.ఈ పరిస్థితులలో వరిసాగు చేసుకుని నష్టపోవద్దు. కేవలం ఆరుతడి పంటలే సాగు చేసుకోవాలి.