
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాకకు ముహూర్తం ఖరారైంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈ నెల 13న ఆయన రాష్ట్రానికి రానున్నారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో అధినేత పర్యటనతో కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపాలని భావిస్తున్న టీపీసీసీ.. రంగారెడ్డి జిల్లాలో రాహుల్ పర్యటించేలా రూట్ మ్యాప్‌ను ఖరారు చేస్తోంది. 13వ తేదీన శంషాబాద్ విమానాశ్రయంలో దిగితే సమీపంలోని క్లాసిక్ గార్డెన్‌లో మహిళలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది.
దీంతోపాటు మరుసటి రోజు విద్యార్థులతో ముఖాముఖి కార్య క్రమాన్ని పీసీసీ ఏర్పాటు చేస్తోంది. దీన్ని విద్యాసంస్థలు ఎక్కువగా ఉన్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ఇవేకాకుండా రోడ్ షోలు, బ స్సు యాత్ర ద్వారా కుత్బుల్లాపూర్, శేరిలింగ ంపల్లి, ఎల్‌బీనగర్, ఉప్పల్‌లో ప్రచారం సాగి ంచేలా షెడ్యూల్‌ను రూపొందిస్తోంది.
అంతేకాకుండా గజ్వేల్ లేదా శివారు నియోజకవర్గాల్లో ఒక చోట బహిరంగ సభ ఏర్పాటు చేసే దిశగా సన్నాహాలు చేస్తోంది. యువనేత పర్యటనను ఖరారు చేస్తూ ఏఐసీసీ సమాచారం ఇవ్వడంలో గురువారం సాయంత్రం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు, ముఖ్యనేతలతో పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జన సమీకరణ, రాహుల్ పర్యటన ఏర్పాట్లపై చర్చించారు. ఈ సమావేశంలో సూత్రప్రాయంగా రూట్ మ్యాప్‌ను ఖరారు చేసినప్పటికీ, శుక్రవారం దీనిపై తుది నిర్ణయం వెలువడనుంది.
Comments
Please login to add a commentAdd a comment