బలం పెంచుకున్న టీఆర్‌ఎస్
ఎంపీటీసీ, జెడ్పీటీసీల్లో ఇదే తీరు
పదవుల భర్తీలో వాయిదాల పర్వం
అసంతృప్తిలో గులాబీ శ్రేణులు
కాంగ్రెస్‌లో కనిపించని ఐక్యత
నాయకుడు లేని పార్టీగా టీడీపీ
సాక్షి ప్రతినిధి, వరంగల్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడాది గడిచిం ది. అప్పటికి.. ఇప్పటికి జిల్లాలో రాజకీయ పరి స్థితులు పూర్తిగా మారాయి. తెలంగాణ సాధన ఉద్యమంలో ముందున్న మన జిల్లా రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజకీయంగా కీలకంగా మా రింది. అవకాశాల విషయంలో జిల్లాకు ప్రాధాన్యత పెరిగింది. ఇది కొనసాగుతూనే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నట్లే జిల్లాలోనూ రాజకీయ సమీకరణలు మారాయి. పార్టీల బలాలు మారి పోయాయి. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు అ ధికార టీఆర్‌ఎస్‌లో చేరారు. కొత్తవారి రాకతో అవకాశాల విషయంలో పోటీ పెరిగింది.
ఇది మొదటి నుంచి టీఆర్‌ఎస్‌లో ఉన్న వారికి ఇ బ్బందికరంగా మారింది. రాజకీయ అవకాశా లు, గుర్తింపు, పదవుల విషయంలో గులాబీ పార్టీ వ్యవస్థాపక కార్యకర్తలు, నాయకులు ఆం దోళనపడుతున్నారు. కొత్తగా వచ్చిన వారికి వెంటనే అవకాశాలు వస్తుండడంతో అసంతృప్తికి గురవుతున్నారు. ఏడాది గడిచినా నామినేటెడ్, పార్టీ పదవులు భర్తీ చేయకపోవడంపై గులాబీ నాయకులు నారాజ్‌గా ఉంటున్నారు.
గతంలో ఎప్పుడు లేని విధంగా గత ఏడాది వరుసగా ఎన్నికలు జరిగాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ, శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు ఫిబ్రవరి నుంచి మే వరకు పూర్తయ్యాయి. సాధారణ ఎన్నికల్లో 12 శాసనసభ స్థానాల్లో టీఆర్‌ఎస్ 8, టీడీపీ 2, కాంగ్రెస్ 1, స్వతంత్ర అభ్యర్థి 1 స్థానంలో గెలిచారు. జూన్ 2న రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది.
అనంతరం భూపాలపల్లి ఎమ్మెల్యే ఎస్.మధుసూదనాచారి కీలకమైన స్పీకర్ పదని చేపట్టారు. కాంగ్రెస్ తరఫున డోర్నకల్ ఎమ్మెల్యేగా గెలిచిన డీఎస్ రెడ్యానాయక్, టీడీపీ తరఫున పరకాల ఎమ్మెల్యేగా గెలిచిన చల్లా ధర్మారెడ్డి 2014, నవంబర్‌లో టీఆర్‌ఎస్‌లో చేరారు. రె డ్యానాయక్ టీఆర్‌ఎస్‌లో చేరిన రోజే నర్సంపే ట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఈ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పార్టీలు మారడంతో జిల్లాలో రాజకీయ బలాబలాలు మారాయి. గ్రామ, మండల స్థాయి ప్రజాప్రతినిధులు భారీగా టీఆర్‌ఎస్‌లో చేరారు.
డిసెంబర్‌లో ములుగు ఎమ్మెల్యే ఎ.చందులాల్ మంత్రి అయ్యారు. ఇలా రాష్ట్ర రాజకీయాల్లో జిల్లాకు ప్రాధాన్యత పెరిగింది. జనవరిలో అనూహ్య మార్పులు జరిగాయి. తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తాటికొండ రాజయ్య భర్తరఫ్‌కు గురయ్యారు. వరంగల్ ఎంపీగా ఉన్న కడియం శ్రీహరి అనూహ్యంగా ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఏడాదిలోపే ఎమ్మెల్సీగా గెలిచారు.
► తెలంగాణ ఆవిర్భావం రోజు నుంచి ఇప్ప టి వరకు జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి ఇబ్బందికరంగా మారుతోంది. జెడ్పీ చైర్‌పర్సన్ ఎన్నికతో కాంగ్రెస్‌లో గ్రూపులు బయటపడ్డాయి. పార్టీకి చెందిన సీనియర్ నాయకులే అధికార పార్టీకి సహకరించడంతో హస్తం శ్రేణుల నిరాశ చెందాయి. అనంతరం పార్టీకి చెందిన సీనియ ర్ ఎమ్మెల్యే డి.ఎస్.రెడ్యానాయక్, మహబూబాబాద్ నియోజకవర్గ ఇంచార్జీ మాలోత్ కవిత టీఆర్‌ఎస్‌లో చేరారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్‌లో చేరినా పార్టీలో కీలక నేతలు క్రియాశీలంగా ఉండడంలేదు. తె లంగాణ పీసీసీ మొదటి అధ్యక్షుడిగా ఉన్న పొ న్నాల లక్ష్మయ్యను ఆ పార్టీ అధిష్టానం తొల గించింది. కాంగ్రెస్ పరంగా రాష్ట్రరాజకీయాల్లో జిల్లాలకు ప్రాధాన్యత గతంలో కంటే తగ్గింది.
► సాధారణ ఎన్నికల్లో రెండు ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకున్న టీడీపీకి పెద్దషాక్ తగిలింది. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి టీడీపీని వీడారు. ద్వితీయ శ్రేణి నేతలు ఎక్కువ మంది పార్టీకి దూరమయ్యారు. టీడీఎల్పీ నేతగా ఎర్రబెల్లి దయాకర్‌రావు గుర్తింపు వచ్చింది. ఈయన తప్ప జిల్లాలో పార్టీకి ముఖ్య నేతలు లేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో టీడీపీ అధ్యక్ష పదవి చేపట్టే నాయకుడే దొరకని పరిస్థితి నెలకొంది.
బలం పెరిగింది..అసంతృప్తి మొదలైంది
Published Tue, Jun 2 2015 2:49 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement