సాక్షి, హైదరాబాద్ : వంశపారంపర్య అర్చకత్వానికి ఆమోదం తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జీవో విడుదల చేయడం పట్ల బ్రాహ్మణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. మాట మీద నిలబడిన వైఎస్ జగన్‌కు ఆజన్మాంతం రుణపడి ఉంటామని అర్చకులు వాగ్దానం చేస్తున్నారు. సీఎం నిర్ణయం వల్ల రాష్ట్రంలో ఎనిమిది లక్షల అర్చక కుటుంబాలు లబ్ది పొందుతాయని, జగన్ ప్రభుత్వం కలకాలం కొనసాగేలా పూజలు చేస్తామని వారు తమ మనోభావాలను వ్యక్తపరుస్తున్నారు.
76 జీవోను చంద్రబాబు నిర్లక్ష్యం చేసి కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని దేవాలయ పరిరక్షణ వేదిక సంధానకర్త కస్తూరి రంగరాజన్ వ్యాఖ్యానించారు. తమ సంక్షేమానికి తండ్రి బాటలో నడుస్తున్న వైఎస్ జగన్‌కు ఆయన కృతజ్ఞతలకు తెలిపారు. అలాగే, అర్చకుల కలను నెరవేర్చారని సూర్యచంద్రులు ఉన్నంతవరకూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన మేలును మరిచిపోలేమని బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు జ్వాలాపురం శ్రీకాంత్ అనంతపురంలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment