రికార్డు బ్రేక్.. | record break.......... | Sakshi
Sakshi News home page

రికార్డు బ్రేక్..

Published Tue, Nov 24 2015 12:27 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

రికార్డు బ్రేక్.. - Sakshi

రికార్డు బ్రేక్..

మహబూబ్‌నగర్ జిల్లాలో కొనసాగుతున్న రాష్ట్రస్థాయి సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీలు సోమవారం ముగిశాయి. పురుష, మహిళల విభాగాల్లో రంగారెడ్డి జిల్లా ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. జిల్లాకు చెందిన అంతర్జాతీయ క్రీడాకారుడు రాజేంద్ర చైతన్య ఆరు నూతన రికార్డులు నెలకొల్పి గత రికార్డులు బ్రేక్ చేశాడు.   

 
 ఆరు రికార్డులు బ్రేక్‌చేసిన చైతన్య   
 = 105 కేజీల విభాగంలో  ఆల్‌టైమ్ రికార్డ్
 = పురుష, మహిళల   విభాగాల్లో ఓవరాల్  
   చాంపియన్ రంగారెడ్డి
 = ముగిసిన   వెయిట్ లిఫ్టింగ్ పోటీలు

 
 మహబూబ్‌నగర్ క్రీడలు : రాష్ట్రస్థాయి సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో రికార్డులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాకు చెందిన అంతర్జాతీయ క్రీడాకారుడు రాజేంద్ర చైతన్య ఆరు నూతన రికార్డులు నెలకొల్పి గత రికార్డులు బ్రేక్ చేశాడు. మహబూబ్‌నగర్ జెడ్పీ మైదానంలో రెండ్రోజులుగా జరుగుతున్న వెయిట్‌లిఫ్టింగ్ పోటీలు సోమవారం సాయంత్రం ముగిశాయి. మొదటిరోజు 58 కేజీల విభాగంలో సింధూ బంగారు పతకం కైవసం చేసుకోగా, రెండోరోజు జరిగిన 105 స్నాచ్‌లో వరుసగా 120, 130, 137 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో రాజేంద్రచైతన్య 160, 175, 180 కిలోల వెయిట్ లిఫ్టింగ్ చేసి సంచలనం సృష్టించి బంగారు పతకం కైవసం చేసుకున్నాడు.
 
 పురుషుల విభాగంలో విజేతలు
 56కిలోల విభాగంలో శివలింగేశ్వర-రంగారెడ్డి (182 కేజీ), యశ్వంత్-రంగారెడ్డి (151కేజీ), 62కిలోల విభాగంలో వెంకటేశ్-హైదరాబాద్ (210కేజీ), కార్తీక్-రంగారెడ్డి (188కేజీ), సంపత్‌కుమార్-హైదరాబాద్ (180కేజీ), 69కిలోల విభాగంలో రాహుల్‌సాగర్-హైదరాబాద్ (225కేజీ), 77కిలోల విభాగంలో శ్రీనివాస్‌రావు-రంగారెడ్డి (220కేజీ), కరుణాకర్-హైదరాబాద్ (205కేజీ), నిహల్‌రాజ్-రంగారెడ్డి (186కేజీ), 94కిలోల విభాగంలో పద్మనాభం-రంగారెడ్డి (228కేజీ), రామ్‌కుమార్-హైదరాబాద్ (221కేజీ), ఆదిగణేష్-కరీంనగర్ (157కేజీ) విభాగంలో విజయం సాధించారు.
 
 మహిళల విభాగంలో..
 63 కిలోల్లో దీక్షిత-రంగారెడ్డి (162కేజీ), దీప్తి-వరంగల్ (110కేజీ), యాస్మిన్-ఖమ్మం (54.5కేజీ), 69 కిలోల విభాగంలో సుకన్య-హైదరాబాద్ (90కేజీ), రత్నకుమారి-ఖమ్మం (75కేజీ), సాయిసంయుక్త-రంగారెడ్డి (65కేజీ), 75కిలోల విభాగంలో రాజేశ్వరి-హైదరాబాద్ (180కేజీ), వైభవి-మెదక్ (47కేజీ), 75+కిలోల విభాగంలో రాజ్యలక్ష్మి-హైదరాబాద్ (160కేజీ), స్మృతి-మెదక్ (82కేజీ), సుప్రియ-కరీంనగర్ (70కేజీ) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు.

 ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించిన రంగారెడ్డి
 వెయిట్ లిఫ్టింగ్ రాష్ట్రస్థాయి పోటీల్లో పురుషుల విభాగంలో 206 పాయింట్లు, మహిళల విభాగంలో 180 పాయింట్లతో రంగారెడ్డి జట్టు ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను పొందింది. రన్నరప్‌గా పురుషుల్లో ఖమ్మం 185 పాయింట్లు, మహిళల్లో 169 పాయింట్లతో హైదరాబాద్ జట్లు నిలిచాయి. టోర్నీలో బెస్ట్‌మెన్ ప్లేయర్‌గా వెంకటేశ్ (హైదరాబాద్), బెస్ట్‌వెమన్‌గా దీక్షిత (రంగారెడ్డి)లు నిలిచారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement