సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేం ద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రికార్డు స్థాయిలో ఒక్క నెలలోనే 190 ప్రసవాలు జరిగాయి. ఇప్పటి వరకు 160 ప్రసవాలు అత్యధిక రికార్డుగా ఉండగా.. గత ఏప్రిల్‌లో అత్యధికంగా 190 ప్రసవాలు చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ తిరుపతి తెలిపారు.
ఇందులో 48 సాధారణ ప్రసవాలు కాగా, 142 శస్త్ర చికిత్సలు చేసినట్లు ఆయన వివరించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో రికార్డుస్థాయిలో ప్రసవాలు చేసిన డాక్టర్ల బృందాన్ని జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ సోమవారం అభినందించారు. స్త్రీవైద్య నిపుణురాలు రమ్య, డాక్టర్ పి.తిరుపతి, హెడ్‌నర్స్ తేజ, నర్స్ ఝాన్సీలను కలెక్టరేట్‌కు పిలిచి శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేసి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జేసీ షేక్ యాస్మిన్‌బాషా, డీఆర్వో శ్యామ్‌ప్రసాద్‌లాల్, డీఎంఅండ్ హెచ్‌వో రమేశ్ పాల్గొన్నారు.