కోలుకుంటున్న చిన్నారులు
మిరుదొడ్డి : సవతి తల్లి దాష్టికానికి గతమూ డేళ్ళుగా నరకం అనుభవించిన అన్నా చెల్లెళ్ళు కరుణాకర్, చిట్టిలు వసతీ గృహాల్లో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. తోటి విద్యార్థుల మధ్య కలుపు గోలుగా ఉంటూ అనుభవిం చిన కన్నీళ్ళను దిగమింగుకుంటున్నా రు. సవతి తల్లి కాఠిన్యానికి గురై చావుకు సైతం సిద్ధపడిన చిన్నారుల ఉదాంతం మండల పరిధిలోని ధర్మారంలో వెలుగులోకి రావడం, అధికారులు వారిని సంక్షేమ హాస్టళ్ళలో చేర్పించిన విషయం విధితమే.
నరక కూ పం నుండి బయట పడ్డ చిన్నారులు ఇప్పుడిప్పు డే తేరుకుంటూ చెప్యాల-అల్వాల క్రాస్ రోడ్డులోని సాంఘీక సంక్షేమ గురుకుల బాలుర వసతీ గృహంలో ఉంటున్న కరుణాకర్‌ను, మండల కేం ద్రమైన మిరుదొడ్డిలో కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం వసతి గృహం లో ఉంటున్న చిన్నారులను అమ్మమ్మ తాతయ్య కంచం బాల్ నర్సవ్వ, నారాయణ (చిన్నారుల అసలు తల్లి శ్యామల తల్లిదండ్రులు)తో పాటు బం ధుమిత్రులు ఆది వారం పరామర్శించి కన్నీరు మున్నీరయ్యారు. మూడేళ్ల నుండి చిన్నారులు పడుతున్న బాధలు తమకు తెలిస్తే అసలు ఆ నరక కూపానికి తాము పంపేవారిమి కాదని రోదించారు. చిన్నారులు పడ్డ బాధలకు ప్రతి ఒక్కరు చలించి పోయారు. కన్నీళ్ళ పర్యంతమయ్యారు.