ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయండి
బాన్సువాడ టౌన్ : పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో సోమవారం వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇంటిని ముట్టడించడానికి విద్యార్థులు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇంటిని ముట్టడించాలని కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున తరలిరావడంతో, ముందే సమాచారం తెలుసుకున్న సీఐ శ్రీని వాస్‌రెడ్డి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మంత్రి ఇంటికి వెళ్లేదారిలో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు సీఎం డౌన్, డౌన్ అంటూ నినాదాలు చేశారు. మంత్రితో ఆయన పీఏ భగవాన్‌రెడ్డి ఫోన్‌లో విద్యార్థులతో మాట్లాడించారు. ఈ సం దర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హన్మాండ్లు యాదవ్ మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ రూ.750 కోట్లను వెంటనే విడుదల చేయించేందుకు కృషి చేయాలని మంత్రికి విన్నవించారు. ఫాస్ట్ పథకంపై ఇప్పటి వరకు ఎలాంటి విధివిధానాలు ప్రకటించకపోవడం శోచనీయమని అన్నారు.
ప్రభుత్వం ఫీజు రీయంబర్స్‌మెంట్‌ను విడుదల చేయకపోవడంతో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను ఒత్తిళ్లకు గురి చేస్తున్నాయని అన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుద ల చేయాలని డిమాండ్ చేశారు. సీఐ శ్రీనివాస్‌రెడ్డి విద్యార్థి నాయకులతో మాట్లాడి అక్కడి నుంచి పం పించారు. కార్యక్రమంలో జోనల్ ఇన్‌చార్జి కాంత్రి కుమార్, ఏబీవీపీ నాయకులు దత్తు, ఓంకార్, పండరి, మనోహర్, శ్రీకాంత్, భరత్, భాను, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్ గంప ఇంటి ముట్టడి
కామారెడ్డిటౌన్ : కామారెడ్డిలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఎమ్మెలే , ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ ఇంటిని ముట్టడించారు. ఇంటి ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కో-కన్వీనర్ మన్నే కృష్ణ మాట్లాడుతూ..ఫీజు రీయింబర్స్‌మెంట్‌పైనే ఎంతో మంది పేద,మధ్య తరగతి కుం టుబాల భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు. అనంత రం ఎమ్మెల్యే ఇంట్లోకి చొచ్చుకు వెళ్లేందుకు ఏబీవీపీ నాయకులు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఆందోళనలో పట్టణ కార్యదర్శి బాల్‌రాజు, నాయకులు శ్రీకాంత్, మల్లేష్, భాస్కర్, రవి, అనీష్, రంజిత, శ్రావణ్, సౌందర్య, శ్రీజ, శ్రావణి, విద్యార్థులు పాల్గొన్నారు.