ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరు మార్చరా? | Rename New Delhi-Hyderabad AP Express after Telangana, says KCR | Sakshi
Sakshi News home page

ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరు మార్చరా?

Published Fri, Dec 19 2014 12:54 AM | Last Updated on Sat, Aug 18 2018 6:29 PM

ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరు మార్చరా? - Sakshi

ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరు మార్చరా?

* అసంతృప్తి వ్యక్తం చేస్తూ కేంద్రానికి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ
* తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా పేరు పెట్టాలని విజ్ఞప్తి..
* కాగజ్‌నగర్ వెళ్లే రైలుకు కొమురం భీం పేరు సూచన

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై ఆరు నెలలవుతున్నా రాజధాని నుంచి న్యూఢిల్లీకి వెళ్లే ఆంధ్రప్రదేశ్ (ఏపీ) ఎక్స్‌ప్రెస్ రైలు పేరును మార్చకపోవడంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ రైలు పేరును తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా మార్చాలని ఇప్పటికే టీఆర్‌ఎస్ ఎంపీలు కేంద్రానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. రైల్వే మంత్రి సురేశ్ ప్రభుకు కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ లేఖ కూడా రాశారు. అయినా కేంద్రం స్పందించకపోవడంతో తాజాగా కేసీఆర్ స్వయంగా రైల్వే మంత్రికి గురువారం లేఖ రాశారు.

ప్రస్తుతం హైదరాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య నడుస్తున్న రైలును తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా పిలుస్తున్న నేపథ్యంలో దాని పేరును కొమురం భీం ఎక్స్‌ప్రెస్‌గా మార్చాలని, ఏపీ ఎక్స్‌ప్రెస్‌కు తెలంగాణ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి తన లేఖలో కేంద్రాన్ని కోరారు. రాష్ర్టం ఏర్పాటై ఆరు నెలలు గడుస్తున్నా హైదరాబాద్-న్యూఢిల్లీ రైలుకు ఏపీ పేరునే కొనసాగించడం సరికాదని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement