తాడిపత్రి రూరల్, న్యూస్‌లైన్ : అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వెంకటరెడ్డిపల్లికి చెందిన బండారు పెద్దిరాజు కేంద్ర ప్రభుత్వ కి శోర్ వైజ్ఞానిక్ పురస్కార్ యోజన(కేవీ పీవై) ఉపకార వేతనానికి ఎంపికయ్యా డు. ఇతను రంగారెడ్డి జిల్లా గౌలిదొడ్డిఏ పీఎస్‌డబ్లూఆర్‌ఎస్ (సాంఘిక సంక్షేమ) జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం (బైపీసీ) చదువుతున్నాడు. భారత శాస్త్ర, సాంకేతిక శాఖ దేశవ్యాప్తం గా ప్రతిభావంతులైన విద్యార్థులను ఎం పిక చేసి సైన్స్ రంగంలో పరిశోధనలు చేయిస్తోంది. ఇందులో భాగంగా ఏటా కిశోర్ వైజ్ఞానిక్ పురస్కార్ యోజన పేరు తో అర్హత పరీక్ష నిర్వహిస్తోంది. గతేడాది అక్టోబర్‌లో నిర్వహించిన పరీక్షలో పెద్దిరాజు ప్రతిభ చూపాడు. దేశవ్యాప్తంగా 37కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 1.7 లక్షల మంది హాజరుకాగా మన రా ష్ట్రం నుంచి పెద్దిరాజు 44వ ర్యాంకు (ఎ స్సీ, ఎస్టీ కోటా) సాధించి స్కాలర్‌షిప్ సాధించాడు.
ఈ పరీక్షలో ర్యాంక్ సాధిం చడం ద్వారా పెద్దిరాజు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్స్ (ఐఐఎస్‌ఈఆర్), ఇండియ న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్), బెంగళూరు), ఐఐఐటీ (హైదరాబాద్), హెచ్‌సీయు (హైదరాబాద్)లో పరిశోధనలు చేసేందుకు సైతం అర్హత సాధిం చాడు. ఈ స్కాలర్‌షిప్ కింద ఇతడికి నెలకు రూ. 4వేలు, సంవత్సరానికి రూ.16 వేలు అందుతుంది. రాష్ట్ర సాం ఘిక సంక్షేమ శాఖ హాస్టళ్ల తరఫున ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన తొలి విద్యార్థి ఇతడే కావడం గమనార్హం. ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికైన పెద్దిరాజుకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమా ర్, ఐపీఎస్ అభినందనలు తెలిపారు.
ఏడో తరగతిలోనే తండ్రిని కోల్పోయి..
పేద కుటుంబంలో జన్మించిన పెద్దిరాజు కు చదువంటే ప్రాణం. మంచి ప్రతిభ చూపుతుండేవాడు. వికలాంగుడైన తం డ్రి నారాయణ.. పెద్ది రాజు ఏడో తరగతి చదువుతుండగా అనారోగ్యంతో మృతి చెందాడు. తల్లి ఓబుళమ్మ కుమారుడితో పాటు కుమార్తె ఇంద్రాణిని బాగా చది వించాలనుకుంది. కూలీగా పనిచేస్తూ పి ల్లలను చదివిస్తోంది. ఇంద్రాణి స్థానికం గా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతిచదువుతోంది. పెద్దిరాజుకు పురస్కారం రావడంతో తన కష్టానికి ప్రతిఫలం దక్కిందని ఆమె హర్షం వ్యక్తం చేస్తోంది.
గురుకుల విద్యార్థికి కిశోర్ పురస్కారం
Published Sun, Mar 23 2014 4:16 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement