చౌటుప్పల్ : రంగులు మార్చే ఊసరవెల్లిలా పార్టీలు మారుస్తూ, ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరిన ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీతో వచ్చిన ఎంపీ పదవికీ రాజీనామా చేయాలని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి వెళ్తూ, చౌటుప్పల్‌లో ఆగారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అయ్యప్ప దేవాలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం టీడీపీ మండల పార్టీ కార్యాలయంలో పలువురు యువకులు టీడీపీలో చేరారు. ఆ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. గుత్తా రాజీనామా చేసే దాకా టీవీల్లో పార్టీ ఫిరాయింపులు, అవినీతి గురించి నీతులు మాట్లాడొద్దన్నారు. గుత్తాతో పాటు ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, రవీంద్రకుమార్ తమ పదవులకు రాజీనామా చేసే దాకా వారిని సాంఘిక బహిష్కరణ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం రీ-డిజైనింగ్‌ల పేరుతో కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకే టెండర్లు పిలుస్తుందన్నారు.
సమావేశంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలిమినేటి సందీప్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు చెన్నగోని అంజయ్యగౌడ్, జక్కలి అయిలయ్య, మండల పార్టీ అధ్యక్షుడు హన్నూభాయ్, గంగాపురం గంగాధర్, కొసన ం భాస్కర్‌రెడ్డి, నల్ల గణేశ్, ఎరుకల మల్లేశంగౌడ్, గ్యార కిష్టయ్య, కాటేపల్లి శేఖర్, ఎంఎన్‌గౌడ్, మల్లారెడ్డి, పర్వతాలు, చలమందరాజు, అంజిరెడ్డి, రవి, మహేశ్ పాల్గొన్నారు.
‘గుత్తా’ రాజీనామా చేయాలి
Published Tue, Jun 21 2016 1:03 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement
Advertisement