హైదరాబాద్ : . ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్ రెడ్డి నిరపరాధి అని, ఆయనపై రాజకీయ కుట్ర జరిగిందని భావిస్తున్నామని రేవంత్ రెడ్డి తరపు న్యాయవాదులు అన్నారు. ఈ కేసుకు సంబంధించి రేవంత్ రెడ్డి న్యాయవాదులు సోమవారం సిటీ సివిల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
ఏసీబీ ఆరోపణలను న్యాయస్థానంలో ఎదుర్కొంటామని తెలిపారు. ఇందుకు సంబంధించి న్యాయమూర్తి... వీడియోలు, ఆడియోలను పరిశీలించాలని పిటిషన్లో కోరినట్లు చెప్పారు. ఈ కేసులో రేవంత్ రెడ్డి బయట ఉన్నప్పుడు అరెస్ట్ చేశారని, ఈఘటనను రాజకీయ కుట్రగానే భావిస్తున్నామని న్యాయవాదులు తెలిపారు.
మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం రేవంత్ రెడ్డిని ఈరోజు ఉదయం పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా జైలు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.
'రేవంత్ రెడ్డి బయట ఉన్నప్పుడు అరెస్ట్ చేశారు'
Published Mon, Jun 1 2015 12:21 PM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement
Advertisement