రేవంత్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో రేవంత్ బెయిల్ పిటీషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. అడిషనల్ కౌంటర్ దాఖలు చేసేందుకు రెండు రోజుల సమయం కావాలని తెలంగాణ అడ్వకేట్ జనరల్ హైకోర్టును కోరారు. ఈమేరకు శుక్రవారం మధ్యాహ్నం 2.15 గంటల వరకు హైకోర్టు గడవు ఇస్తూ.. విచారణ వాయిదా వేసింది. దాంతో బెయిల్ పిటిషన్పై ఎలాంటి వాదనలు జరగకుండానే కేసు వాయిదా పడింది. కాగా ఈరోజు ఉదయం రేవంత్ రెడ్డికి చర్లపల్లి జైల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న మత్తయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ శివశంకర్రావు విచారించనున్నారు.