ఇక కబ్జాదారులపై ‘పిడి’కిలి | Revenue department to handover lands from illegal contractors | Sakshi
Sakshi News home page

ఇక కబ్జాదారులపై ‘పిడి’కిలి

Published Thu, Mar 5 2015 3:10 AM | Last Updated on Sat, Sep 2 2017 10:18 PM

ఇక కబ్జాదారులపై ‘పిడి’కిలి

ఇక కబ్జాదారులపై ‘పిడి’కిలి

సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రభుత్వం కల్పించిన భూముల క్రమబద్ధీకరణ సదుపాయాన్ని వినియోగించుకోని వారిని కబ్జాదారులుగానే పరిగణిస్తాం. వారిపై రెవెన్యూ చట్టాలను ప్రయోగించి ఆక్రమిత భూములన్నింటినీ స్వాధీనం చేసుకుంటాం’’ అని రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా స్పష్టం చేశా రు. బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ కు సంబంధించిన పలు అంశాలను వివరిం చారు. జీవో 58 కింద ఉచిత కేటగిరీలో జనవరి 31తో, జీవో 59 కింద చెల్లింపు కేటగిరీలో ఫిబ్రవరి 28తో దరఖాస్తు ప్రక్రియ ముగిసిందన్నారు.  వివిధ జిల్లాల నుంచి ఉచిత కేటగిరీలో మొత్తం 3,47,499, చెల్లింపు కేటగిరీలో 28,336 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. చెల్లింపు కేటగిరీలో దరఖాస్తు దారులు రిజిస్ట్రేషన్(12.5శాతం) ధర కింద రూ.133.58కోట్లు చెల్లించారని చెప్పారు. ఇకపై దరఖాస్తు చేసుకునేందుకు మరో అవకాశం ఇచ్చే ప్రసక్తే లేదన్నారు.
 
 కబ్జాలను ఉపేక్షించం..
 ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. వీరిపై కఠినమైన రెవె న్యూ చ ట్టాలను(ల్యాండ్ ఆక్రమణల చట్టం 1905, ల్యాడ్ గ్రాబింగ్ యాక్ట్ 1982, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ 1986)లను ప్రయోగిస్తామన్నారు. ప్రస్తుతం దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోందని, అది పూర్తి కాగానే దరఖాస్తు చేసుకోని వారినుంచి భూములను స్వాధీనం చేసుకుంటామన్నారు.
 
 సొమ్ము చెల్లించిన భూమికే..
 క్రమబద్ధీకరణకు సంబంధించి పేద వర్గాల కు ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటు ప్రకారం ఉచిత కేటగిరీలో 125గజాల వరకు అసైన్‌మెంట్ పట్టాను ఇస్తామని బీఆర్ మీనా చెప్పారు. ఒకవేళ ద రఖాస్తులో పేర్కొన్న స్థలం 125గజాలకు పైగా 150గజాల్లోపు ఉన్నట్లైతే నిబంధనల ప్రకారం మిగిలిన భూమికి రిజిస్ట్రేషన్ ధరలో 10శాతం చెల్లించాలన్నారు. ఇటువంటి ప్రత్యేక కేసుల్లో.. ఉచితంగా క్రమబద్ధీకరించే స్థలానికి అసైన్‌మెంట్ పట్టా ఇస్తామని, సొమ్ము చెల్లించిన  మేర స్థలానికే రిజిస్ట్రేషన్ కార్యాలయంలో హక్కు బదిలీ  చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement