నార్కట్‌పల్లి: హాస్టళ్లో ఉంటున్న తన కొడుకును సంక్రాంతి పండగకు తీసుకుని వస్తుండగా తండ్రితో పాటు కొడుకును రోడ్డు ప్రమా దం రూపంలో మృత్యువు కబళించింది. ఈ సంఘటన 65వ నంబర్ జాతీయరహదారిపై నార్కట్‌పల్లి మండల కేంద్రంలోని కేఎంసీఎల్ కంపెనీ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన జినక మల్లేషం(45) మేస్త్రీ పనిచేసి జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు ఇద్దరు భార్యలు. వీరిలో చిన్నభార్య మూడునెలల క్రితం మరణించింది. చిన్నభార్యకు ఇద్దరు కొడుకులు. వీరిలో పెద్దకుమారుడు జినక శివ(14) కాగా చిన్నకుమారుడికి పోలియో వచ్చింది.
ఇదిలా ఉండగా జినక శివ నల్లగొండలోని ఓ క్రిస్టియన్‌హాస్టల్‌లో ఉంటూ ఆరో తరగతి చదువుకుంటున్నాడు. అయి తే మల్లేషం సం క్రాంతి పండగకు తనకొడుకు శివను ద్విచక్రవాహనంపై కూర్చోబెట్టుకుని నల్లగొండను నుంచి స్వగ్రామానికి వస్తున్నాడు. మార్గమధ్యంలో నార్కట్‌పల్లిలో వీరు రాంగ్‌రూట్‌లో రావడంతో ఎదురుగా హైదరాబాద్ నుంచి విజ యవాడకు వెళ్తున్న కారు ఢీకొ ట్టి వెళ్లిపోయింది. దీంతో ఆ సమయంలో వెళ్తున్న మరో కారు కింద వీరిద్దరు పడిపోయి అక్కడికక్కడే మృతిచెం దారు. మొదటిభార్య సాలమ్మ ఫిర్యాదుమేరకు ఎస్‌ఐ మోతీరామ్ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
మృత దేహాలను పరిశీలించినఎమ్మెల్యే
సం ఘటనా స్థలానికి ఎమ్మెల్యే వేముల వీరేశం చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాలను పరిశీలించారు. చౌరస్తా వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయన వెంట ఎంపీపీ మలికార్జున్‌రెడ్డి ఉన్నారు.
పండగకు తీసుకొస్తుండగా..
Published Mon, Jan 12 2015 11:53 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM
Advertisement