అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
నిజామాబాద్: తాళాలు వేసి ఉన్న ఇళ్లనే టార్గట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను నిజామాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ప్రధాన కార్యాలయంలో ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి శుక్రవారం వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన ఐదుగురు సభ్యుల ముఠాలో నలుగురిని గురువారం అరెస్ట్ చేయగా, ఒకరు పరారీలో ఉన్నారు. పట్టుబడిన వారి నుంచి 61 తులాల బంగారు ఆభరణాలు, 15 తులాల వెండి ఆభరణాలు, ఒక పల్సర్ బైక్, రెండు చాకులు, మూడు ఇనుప రాడ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా నిజామాబాద్‌లో ఎనిమిది, మెదక్ జిల్లాల్లో ఆరు చోరీలకు పాల్పడినట్టు ఎస్పీ తెలిపారు.