సాక్షి, హైదరాబాద్: పేదింటి ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదనే ఉద్దేశంతో తలపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో భారీ నిధులు కేటాయించనుంది. ప్రస్తుతం ఈ పథకం కింద ఒక్కో లబ్ధిదారుడికి రూ.75వేల ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. తాజాగా ఈ సాయాన్ని ఏకంగా రూ.లక్షకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా 2018–19 వార్షిక సంవత్సరంలో బడ్జెట్ కింద ఏకంగా రూ.1,000 కోట్లు కేటాయించబోతోంది.
ఈ మేరకు పథకం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు దరఖాస్తులు, పంపిణీ తదితర వివరాలను సమర్పించాలని సంక్షేమ శాఖలకు ప్రభుత్వంఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో శాఖల వారీగా లబ్ధిదారులు, పంపిణీ చేసిన సాయం వివరాలను అధికారులు సమర్పించారు. ఈ రెండు పథకాల కింద ఇప్పటివరకు 3.25 లక్షల దరఖాస్తులు రాగా... వీటిలో 3లక్షల మందికి ఆర్థిక సాయాన్ని మంజూరు చేశారు. 2018–19 వార్షిక సంవత్సరానికి లక్ష దరఖాస్తులు రావొచ్చని అంచనా.
ఈ నేపథ్యంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు వార్షిక బడ్జెట్ కింద రూ.వెయ్యి కోట్లకు సంక్షేమ శాఖలు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించాయి. కల్యాణలక్ష్మి పథకాన్ని ఈబీసీ(ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు)లకూ వర్తింపచేయాలని ప్రభుత్వం సూచనప్రాయంగా నిర్ణయించింది.
కల్యాణ కానుకకు రూ.1,000 కోట్లు
Published Thu, Feb 8 2018 2:53 AM | Last Updated on Thu, Feb 8 2018 2:53 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment