హన్మకొండ: కాళోజీ కళా కేంద్రం నిర్మాణ పనులకు రూ.50 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. శంకుస్థాపన చేసి ఏడాది గడిచినా ఇప్పటి వరకు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్న కళా కేంద్రం నిర్మాణ పనులు.. ఇకపై వేగం పుంజుకోనున్నాయి. తెలంగాణ పర్యాటకాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పనులు జరగనున్నాయి. ప్రజాకవి కాళోజీ నారాయణరావు శతజయంతి కానుకగా 2014 సెప్టెంబరు 9న వరంగల్ నగరంలో ఈ కళా కేంద్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అంతర్జాతీయస్థాయి హంగులతో ఆరు నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.
ప్రభుత్వం చెప్పిన గడువు ముగిసిపోయి ఏడాది దాటినా కాళోజీ కళా కేంద్రం నిర్మాణ పనుల్లో వేగం పుంజుకో లేదు. ఎట్టకేలకు తెలంగాణ పర్యాటక శాఖ ఒకేసారి రూ.50 కోట్ల నిధులు మంజూరు చేసింది. అంతేకాకుండా.. వెంటనే టెండర్లు ఆహ్వానించి పనులు ప్రారంభించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఈ కళా కేంద్రం నిర్మాణానికి సంబంధించి 2015 నుంచి 2017 వరకు మూడు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన బడ్జెట్‌ను ఒకేసారి విడుదల చేసింది. దీంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనులు ముందుకు సాగనున్నాయి.
కాళోజీ కళా కేంద్రానికి రూ.50 కోట్లు
Published Tue, Dec 22 2015 1:17 AM | Last Updated on Tue, Oct 30 2018 7:57 PM
Advertisement