మెదక్(నారాయణఖేడ్): బ్రేకులు ఫెయిల్ అయిన ఆర్టీసీ బస్సు ఓ గూడ్సు క్యారీయర్‌ను ఢీకొట్టింది. ఈసంఘటన మెదక్ జిల్లా నారాయణఖేడ్‌లోని నెహ్రూనగర్ ప్రధాన రహదారిపై మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు....నారాయణ ఖేడ్‌డీపోకు చెందిన ఆర్టీసీ బస్సు నారాయణఖేడ్ నుంచి నాగన్‌పల్లి వెళుతుండగా నెహ్రూనగర్ వద్ద బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. ఎదురుగా వచ్చే వాహనాలను ఢీకొనకుండా తప్పించబోయిన బస్సు డ్రైవర్,గూడ్స్ క్యారియర్‌ను ఢీకొట్టాడు.
దీంతో గూడ్సు వాహనం పూర్తిగా ధ్వంసమైంది. అయితే బస్సులో ఉన్న ప్రయాణీకులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. దాదాపు 70మంది బస్సులో ప్రయాణీస్తున్నట్లు సమాచారం.