ఆకేరులో.. ఇసుకాసురులు
యథేచ్ఛగా సాగుతున్న దందా పచ్చని చెట్లు నేలమట్టం
బోసిపోతున్న ఆకేరు వాగు కన్నెత్తి చూడని అధికారులు
అడ్డు చెప్పేవాళ్లు లేకపోవడంతో.. ఇసుకాసురుల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. ఫలితంగా జలధారలతో కళకళలాడాల్సిన ఆకేరు వాగు బోసిపోతోంది. ట్రాక్టర్లు, జేసీబీలతో వాగు నుంచి నిత్యం ఇసుకను తరలిస్తున్నా పట్టించుకునే నాథుడే లేకుండాపోయూడు. దీంతో వర్ధన్నపేట మండలంలోని వాగు పరివాహక ప్రాంతాల్లో భూగర్భ జలమట్టాలు అడుగంటారుు. ప్రకృతి సంపదను అక్రమార్కులు దర్జాగా కొల్లగొడుతున్నా పట్టించుకోకపోవడం పట్ల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆకేరు వాగులో ఇసుక దొంగల హల్‌చల్‌పై పరిశీలనాత్మక కథనమిది. - వర్ధన్నపేట
వర్ధన్నపేట మండలంలోని నందనం, వర్ధన్నపేట, ఇల్లంద, కొత్తపల్లి, ల్యాబర్తి గ్రామాల మీదుగా సుమారు 20 కిలోమీటర్ల పొడవునా ఆకేరు వాగు ప్రవహిస్తుంది. స్టేషన్ ఘన్‌పూర్ మండలం నష్కల్ నుంచి మొదలయ్యే ఆకేరు వాగు జఫర్‌గఢ్, వర్ధన్నపేట, పాలకుర్తి మహబూబాబాద్ , డోర్నకల్ నియోజకవర్గాల మీదుగా ప్రవహిస్తూ పాలేరు నదిలో కలుస్తుంది. ఆయూ పరివాహక ప్రాంతాలు సస్యశ్యామలం కావడానికి ఆకేరు ఎంతో దోహదం చేస్తోంది. అటువంటి వాగుపై అక్రమార్కుల కన్నుపడింది. జఫరగడ్ మండలం ఉప్పుగల్లులో మొదలుకొని కొత్తపల్లి, ల్యాబర్తి వరకు ఆకేరు వాగులో ఇసుక దందా సాగుతోంది. వాగు నుంచి ట్రాక్టర్లు, జేసీబీల సాయంతో ఇసుకను వరంగల్ నగరానికి తరలించి విక్రరుుంచి
జేబులు నింపుకుంటున్నారు. ఈ వ్యవహారంపై నిలదీసే అధికారులకు ఆమ్యామ్యాలు ముట్టజెప్పి.. నోళ్లు మూరుుస్తున్నారు. ‘ఇసుకను తరలించడం వల్ల భూగర్భజలాలు తగ్గిపోతున్నారుు?’ అంటూ నిలదీసే రైతులపై దాడులు చేసేందుకు ఇసుకాసురులు వెనుకాడటం లేదు. ‘భారీ వాహనాల్లో ఇసుకను తరలిస్తున్నందున మా ఊరిలోని రోడ్లన్నీ పాడవుతున్నారుు?’ అని ప్రశ్నించే ప్రజల గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నారు. సామాన్యుడు ఇంటి పన్ను, విద్యుత్తు బిల్లు వంటి కట్టడంలో ఆలస్యం చేసినా నానా రభస చేసే అధికారులకు ఇటువంటి వ్యవహారాల్లో నిబంధనలు గుర్తుకు రావా? ప్రకృతి వనరులను యథేచ్ఛగా దోపిడీ చేస్తున్న వారిపై కొరడా ఝుళిపించడం రెవెన్యూ, మైనింగ్, పోలీసు విభాగాల బాధ్యత కాదా? ఇటువంటి అంశాలపై ప్రజాసంఘాలు ఉద్యమించాల్సిన అవసరముంది.
రోడ్లు ఛిద్రం.. భూగర్భజలాలు మాయం
భారీ వాహనాల్లో అక్రమంగా ఇసుకను తరలించే మార్గాల్లోని అంతర్గత రహదారులు అనతికాలంలోనే దెబ్బతింటున్నారుు. రూ.కోట్లు ఖర్చు చేసి వేసిన రోడ్లు దెబ్బతింటుంటే పర్యవేక్షించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంటుంది. అక్రమంగా ఇసుకను తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటే పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశాలు ఉంటాయని ప్రజలు పేర్కొంటున్నారు. నందనం, కిక్కిరాలపెల్లి, ఇల్లంద, కొత్తపెల్లి, ల్యాబర్తిలలోని రోడ్లు ఇసుకను తరలించే వాహనాల కారణంగా అధ్వానంగా తయూరయ్యూరుు. ఏళ్ల తరబడి వాగు పరివాహక ప్రాంతం నుంచి భారీగా ఇసుకను తరలించే క్రమంలో పరిసరాల్లోని పచ్చని చెట్లు నేలకూల్చారు. ఇవన్నీ వెరసి భూగర్భజలాలు పూర్తిగా అడుగంటారుు. బోరు, వ్యవసాయ బావులు వట్టిపోతున్నాయి. ఫలితంగా సస్యశ్యామలంగా ఉండాల్సిన ఆకేరు పరివాహక ప్రాంతాల్లో.. ప్రజానీకం దాహం కేకలు వినిపిస్తున్నారుు.
ప్రమాదాలు జరుగుతున్నా పట్టింపు కరువు
ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగుతున్నా అధికార యంత్రాంగానికి చీమకుట్టినట్లరుునా లేదు. కొంతకాలం క్రితం ల్యాబర్తి గ్రామంలో ఇసుక తోడుతున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డాడు. కొత్తపెల్లిలోనూ ఇసుక తీస్తున్న ఓ కూలీ ప్రమాదంలో గాయూలపాలయ్యూడు. ఇలాంటి ప్రమాద ఘటనలు జరుగుతున్నా రెవెన్యూ, మైనింగ్, పోలీసు విభాగాలు చూసీ చూడనట్లుగా వ్యవహరిసుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆకేరు పరివాహక ప్రాంతాల్లోని కొంతమంది కింది స్థాయి రెవెన్యూ సిబ్బంది ఇసుకాసురుల ఇచ్చే ఆమ్యామ్యాలతో లక్షలకు పడగలెత్తుతున్నారనే ఆరోపణలున్నారుు. రానున్న రోజుల్లోనూ ఇసుక దందాను పట్టించుకోకుంటే.. ఆకేరు వాగు ఆనవాళ్లు కనిపించకుండా పోయే అవకాశాలు ఉన్నారుు. ప్రకృతి సంపదను కాపాడుకునేందుకు ఇప్పటికైనా నడుం బిగించాలి.