సానియా స్పూరి మరెందరికో ఆదర్శం కావాలి: కేసీఆర్
హైదరాబాద్: టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా స్పూర్తి మరెంతో మంది క్రీడాకారులు ఆదర్శం కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. యూస్ ఓపెన్ మిక్స్‌డ్ విజేతగా నిలిచిన సానియా మీర్జా ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. తెలంగాణ ప్రభుత్వం తరపున సానియాకు అవసరమైన సాయం అందిస్తామని కేసీఆర్ అన్నారు.
త్వరలో ప్రభుత్వం తరపున సానియా మిర్జాకు సన్మానం చేస్తామని కేసీఆర్ మీడియాకుత తెలిపారు. ఈ సందర్బంగా తనను ప్రోత్సహించినందుకు కేసీఆర్‌కు సానియా కృతజ్ఞతలు తెలిపారు.