చొప్పదండి (కరీంనగర్) : ఎస్సై వైఖరికి నిరసనగా ఓ గ్రామ సర్పంచ్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ హల్ చల్ చేస్తున్నాడు. అనవసరంగా తనను వేధిస్తున్నారని చేతిలో ఉరితాడుతో గ్రామంలోని సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానంటున్నాడు. విషయం తెలిసిన స్థానికులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్ గ్రామంలో గురువారం సాయంత్రం జరిగింది.
గ్రామ సర్పంచ్ వెంకట్‌రెడ్డిపై రెండు రోజుల కిందట ఓ విషయమై స్టేషన్ పరిధిలో ఫిర్యాదు నమోదైంది. దీంతో ఎస్సై ఆయనపై చర్యలు తీసుకోవడానికి ఆయనను స్టేషన్‌కు పిలిపించారు. కాగా బాధితులు వారి ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. అయినా ఎస్సై ఇంకా వేధిస్తున్నారనే కారణంతో సర్పంచ్ టవరెక్కి ఆత్మహత్యాయత్నానికి దిగాడు. కాగా ప్రస్తుతం ఆయనను కిందికి దించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
సెల్ టవరెక్కిన సర్పంచ్
Published Thu, Aug 27 2015 6:21 PM | Last Updated on Sun, Sep 2 2018 3:46 PM
Advertisement
Advertisement