
రాజన్న సిరిసిల్ల: వేములవాడ మండలంలోని హనుమక్కపల్లిలో దారుణం చోటుచేసుకుంది. చందుర్తి మండలం మూడపల్లికి చెందిన సర్పంచ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం వేటకొడవళ్లతో దాడిచేసి హత్య చేశారు. హత్యకి గురైన వ్యక్తిని కాంగ్రెస్ నేత శంకర్‌గా గుర్తించారు. పాతకక్షల కారణంగానే హత్యచేశారని సమాచారం. గుర్తు తెలియని వ్యక్తులు కారును వెంబడించి సర్పంచ్‌ను దారుణంగా హత్యచేశారు.