కాంగ్రెస్‌ అభ్యర్థులపై స్క్రీనింగ్‌ కమిటీ కసరత్తు  | Screening committee work on Congress candidates | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ అభ్యర్థులపై స్క్రీనింగ్‌ కమిటీ కసరత్తు 

Published Wed, Mar 13 2019 4:14 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

Screening committee work on Congress candidates - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల బరిలో తెలంగాణ నుంచి నిలిచే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ కసరత్తు చేస్తోంది. మంగళవారం రాత్రి పార్టీ ప్రధాన కార్యదర్శి, సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్‌ ఇంట్లో  సమావేశమయ్యారు. ఈ భేటీకి టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్సీ కుంతియా, ఇన్‌ చార్జి కార్యదర్శులు సలీం అహ్మద్‌ తదితరులు హాజరయ్యా రు.

ఇప్పటికే ఒక్కో నియోజకవర్గానికి ఒకటి నుంచి మూడు పేర్లను ప్రతిపాదిస్తూ పీసీసీ జాబితా పంపిం ది. స్క్రీనింగ్‌ కమిటీ ఈ జాబితా నుంచి అభ్యర్థులను ఎంపికచేసి పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి సిఫారసు చేయనుంది. సోనియా, రాహుల్‌ సమక్షంలో కేంద్ర ఎన్నికల కమిటీ గురువారం అభ్యర్థుల జాబితాకు ఆమోద ముద్ర వేయనుంది. కాగా, టీఆర్‌ఎస్‌లో సీట్లు రాని సిట్టింగ్‌ ఎంపీలు కాంగ్రెస్‌లో చేరితే వారికి టికెట్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇక ఏపీ అభ్యర్థుల ప్రాథమిక జాబితా బుధవారం ఢిల్లీకి చేరనుందని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement