వలిగొండ : మొదటి దశ మిషన్ కాకతీయ పనుల్లో రాష్ర్టంలో నల్లగొండ జిల్లా రెండో స్థానంలో ఉందని కలెక్టర్ సత్యనారాయణరెడ్డి తెలిపారు. వలిగొండ మండలంలోని లోతుకుంటలో ఊరచెరువు, వెల్వర్తిలో పాపినేని చెరువు పునరుద్ధరణ పనులను బుధవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిషన్ కాకతీయ పథకం రెండో దశలో జిల్లాలో 843 చెరువులకుగాను 560 చెరువుల పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. చెరువు పునరుద్ధరణ పనుల్లో రైతుల భాగస్వామ్యం ప్రధానమన్నారు. పూడిక మట్టిని రైతులు పంటచేలలో ఉపయోగించుకోవాలన్నారు. జిల్లాలోని 12 నియోజకవర్గాలలో నీటి ఎద్దడి నివారణకు రూ.16 కోట్లు నిధులు మంజూరు చేశామన్నారు. వాటిని అద్దె బోర్లకు, పైపులైన్లకు ఉపయోగించి నీటి కొరత లేకుండా చూస్తున్నామన్నారు. కలెక్టర్ వెంట ఐబీ ఎస్‌ఈ ధర్మ, ఈఈ సుందర్, ఎంపీపీ శ్రీరాముల నాగరాజు, ఏఈ వీరారెడ్డి, తహిసీల్దార్ అరుణారెడ్డి, స్థ్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.
గ్రామాల్లో తాగునీటి ఎద్దడిని నివారించాలి..
నల్లగొండ : గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆలేరు నుంచి మండలస్థాయి అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వ హించారు. జిల్లాలో 756 గ్రామాల్లో 1170 బోర్లను అద్దెకు తీసుకుని , 81 గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామన్నారు. ప్రతి రోజు ఆర్‌డబ్ల్యూస్ ఏఈ లు ఐదు గ్రామాలు తిరిగి, గ్రామంలో ఉన్న నీటి సమస్య పైపు లైన్ల లీకేజీ, జీఎస్‌ఎల్‌ఆర్ ట్యాంకుల ఓవర్ ఫ్లో, పైపులైన్ల డ్యామేజీ తదితర వాటిని పరిశీలించి తక్షణమే పరిస్కరించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జేసీ సత్యనారాయణ, ఏజేసీ వెంకట్రావు, డీఆర్వో రవినాయక్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ రమణ, డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి, సీఈవో మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
‘మిషన్ కాకతీయ’లో రెండో స్థానం
Published Thu, Apr 21 2016 2:15 AM | Last Updated on Sun, Sep 3 2017 10:21 PM
Advertisement
Advertisement