జాతర్లలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎన్టీరామారావు
ఇచ్చోడ(బోథ్): బజార్‌హత్నూర్ మండలం లోని గిరి జన గ్రామమైన జాతర్లకు 1985 లో ఎన్టీ రామారావు వచ్చారు. జాతర్ల గ్రామానికి చెందిన గోడం రామారావుకు టీడీపీ టికెట్ ఇచ్చి జాతర్లలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. 1983లో టీడీపీ ఆవిర్భావం తర్వాత బోథ్ నియోజకవర్గం ఎస్టీ అసెంబ్లీ స్థానానికి టీడీపీ నుంచి ఇచ్చోడ మండలంలోని హీరాపూర్ గ్రామానికి చెందిన కిషన్‌చౌహన్‌కు టికెట్ ఇచ్చారు.
ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మర్సకోల కాశీరాం.. కిషన్‌చౌహన్‌పై గెలు పొందారు. రెండేళ్లకే మరోసారి ఎన్నికలు వచ్చాయి. దీంతో 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లంబాడా వర్గానికి కాకుండా ఆది వాసీ వర్గానికి చెందిన గోడం రామారావు ను ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేయిం చి స్వయాన ఎన్టీ రామారావు జాతర్ల గ్రామానికి వచ్చి గోడం రామరావుకు బీఫారం ఇచ్చి అభ్యర్థిగా ప్రకటించారు. జాతర్ల నుం చి ఆదిలాబాద్ జిల్లా ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.
ఈ ఎన్నికల్లో గోడం రామారావు టీడీపీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి సిడాం భీంరావుపై 14,333 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అప్పటి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ 250 స్థానాలకు పోటీ చేయగా 202 స్థానాల్లో విజయం సాధించి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. బోథ్‌లో గెలుపొందిన రామారావుకు గిరిజన సంక్షేమశాఖ మంత్రి పదవి ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment