సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కొత్తగా ఏడు చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇరు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే సరకు రవాణా వాహనాలను తనిఖీ చేసేందుకు వీటిని ఏర్పాటు చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బి.ఆర్.మీనా ఉత్తర్వులు జారీ చేశారు.
కొత్త చెక్‌పోస్టులు ఇవే!
1. మహబూబ్‌నగర్ జిల్లా తుంగభద్ర బ్రిడ్జి దగ్గర (ఎన్.హెచ్-7, హైదరాబాద్- కర్నూలు మార్గం), 2. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ దగ్గర (దేవరకొండ-మాచర్ల), 3. నల్లగొండ జిల్లా విష్ణుపురం దగ్గర (మిర్యాలగూడ- ఒంగోలు ), 4. నల్లగొండ జిల్లా కోదాడ దగ్గర (విజయవాడ-హైదరాబాద్), 5. ఖమ్మం జిల్లా మధిర దగ్గర (ఖమ్మం-తిరువూరు), 6. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట దగ్గర (ఖమ్మం- రాజమండ్రి), 7. ఖమ్మం జిల్లా పాల్వంచ వద్ద (ఖమ్మం- మైలవరం మార్గం).
తెలంగాణలో ఏడు కొత్త చెక్‌పోస్టులు
Published Sat, Jun 21 2014 5:34 AM | Last Updated on Sat, Jun 2 2018 3:18 PM
Advertisement