సాక్షి, హైదరాబాద్: రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘వ్యవసాయ రుణాల మాఫీ కోసం రూ.1,200 కోట్లు విడుదల చేయాలనే సీఎం ఆదేశాలతో రాష్ట్రంలో 5.5 లక్షల మంది రైతులు రుణ విముక్తులవుతారు. వీటితో పాటు మరో రూ.7 వేల కోట్లను రైతు బంధు కింద పెట్టుబడి సాయంగా విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. దీని ద్వారా రాష్ట్రంలో 57 లక్షల మంది రైతులకు లబ్ధి జరుగుతుంది’అని ఆయన వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment