బాలికపై లైంగిక దాడి | Sexual assault on the 14 years girl | Sakshi
Sakshi News home page

బాలికపై లైంగిక దాడి

Published Fri, Oct 3 2014 2:30 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

బాలికపై లైంగిక దాడి - Sakshi

బాలికపై లైంగిక దాడి

- మాజీ కౌన్సిలర్‌పై కేసు
- శిక్షించాలని మహిళా సంఘాల డిమాండ్
కోరుట్ల : ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలు, బాలికలపై లైంగిక దాడులు ఆగడంలేదు. అభం శుభం తెలియని చిన్నారులపైనా మృగాళ్ల దాష్టీకం పెరుగుతోంది. తాజాగా కోరుట్ల పట్టణంలోని కల్లూర్‌రోడ్‌లో నివాసముండే బాలిక(14)పై మున్సిపల్ మాజీ కౌన్సిలర్ అబ్దుల్ రషీద్ లైంగిక దాడి చేశాడు. బుధవారం రాత్రి ఆ బాలిక ఉంటున్న గుడిసెలోకి వచ్చి బలవంతంగా మెమిన్‌పురాలోని తన ఇంటికి తీసుకువచ్చి లైంగిక దాడి చేశాడు. బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి బాలికతో పాటు రషీద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై నిర్భయ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.
 
నిందితుడిని కఠినంగా శిక్షించాలి
బాలికపై లైంగిక దాడి చేసిన మాజీ కౌన్సిలర్ రషీద్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. గురువారం మధ్యాహ్నం జాతీయ రహదారిపై మహిళలు రాస్తారోకో చేశారు. మహిళలపై లైంగిక దాడులు పెరిగిపోతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. తాజా సంఘటనలో నిందితుడిపై కఠినమైన చట్టాలు ప్రయోగించి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆ మేరకు పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement