
మిర్యాలగూడ రూరల్ : కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ మృగాడు ఐదేళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ఆదివారం రాత్రి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బాలిక రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇంటి వద్ద ఆడుకుంటోంది.
అది గమనించిన అదే గ్రామానికి చెందిన గొట్టేటి రాము చాక్లెట్ కొనిస్తానని చెప్పి చిన్నారిని గ్రామ పంచాయతీ కార్యాలయంలోకి తీసుకెళ్లాడు. అనంతరం చిన్నారిపై లైంగికదాడి చేశాడు. కుమార్తె కనిపించకపోవడంతో తండ్రి వెతకడం ప్రారంభించగా పంచాయతీ కార్యాలయం వద్ద రోదిస్తూ కనిపించింది. అప్పటికే రాము అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించి హెడ్‌కానిస్టేబుల్ ఉమాపతిరావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment