'పొన్నాలా... పదవి వదులుకో'
హైదరాబాద్: మెదక్ ఉప ఎన్నికలో పార్టీ ఓటమి తనదే బాధ్యతన్న పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తన పదవికి రాజీనామా చేయాలని మాజీ మంత్రి పి. శంకర్రావు డిమాండ్ చేశారు. సయన్వయ కమిటీ సభ్యుల మధ్యే సమన్వయం లేదని ఆయన అన్నారు. పీసీసీ అధ్యక్ష పదవి సమర్థ నాయకుడికి ఇవ్వాలంటూ తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాసినట్టు శంకర్రావు తెలిపారు.
తెలంగాణ కాంగ్రెస్ సమన్వయ కమిటీ ఏర్పాటు చూస్తూ ఏఐసీసీ సోమవారం నిర్ణయం తీసుకుంది, దీనిలో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సహా మొత్తం 8 మంది సభ్యులకు ఇందులో చోటు కల్పించారు