P. Shankar Rao
-
'పొన్నాలా... పదవి వదులుకో'
హైదరాబాద్: మెదక్ ఉప ఎన్నికలో పార్టీ ఓటమి తనదే బాధ్యతన్న పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తన పదవికి రాజీనామా చేయాలని మాజీ మంత్రి పి. శంకర్రావు డిమాండ్ చేశారు. సయన్వయ కమిటీ సభ్యుల మధ్యే సమన్వయం లేదని ఆయన అన్నారు. పీసీసీ అధ్యక్ష పదవి సమర్థ నాయకుడికి ఇవ్వాలంటూ తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాసినట్టు శంకర్రావు తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ సమన్వయ కమిటీ ఏర్పాటు చూస్తూ ఏఐసీసీ సోమవారం నిర్ణయం తీసుకుంది, దీనిలో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సహా మొత్తం 8 మంది సభ్యులకు ఇందులో చోటు కల్పించారు -
రెబల్స్ రగడ
కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థుల జాబితాపై నిరసనలు భగ్గుమన్నాయి. టికెట్లు ఆశించి భంగపడిన నేతలు తిరుగుబావుటా ఎగురవేశారు. పలుచోట్ల స్వతంత్రంగా బరిలోకి దిగుతామని సవాల్ విసిరారు. కంటోన్మెంట్ టికెట్ దక్కని డాక్టర్ శంకర్రావు స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించారు ఎల్బీనగర్ స్థానంలో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా పోటీకి హైదరాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ముద్దగోని రాంమోహన్గౌడ్ ఏర్పాట్లు చేసుకున్నారు ఇబ్రహీంపట్నం టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సైతం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించారు. సోమవారం సాయంత్రం నగరంలో భారీ సమావేశాన్ని నిర్వహించి కాంగ్రెస్ పార్టీ పెద్దల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు ముషీరాబాద్ స్థానానికి తన కుమారుడి అభ్యర్థిత్వాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని మాజీ ముఖ్యమంత్రి అంజయ్య సతీమణి, ఎమ్మెల్యే మణెమ్మ ఆక్షేపించారు. ఇందిరాగాంధీ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఆమె వెంట నడిచి అనేక కష్టాలు అనుభవించిన తమ కుటుంబానికి పార్టీ తీరని అన్యాయం చేసిందని వాపోయారు. కుటుంబంలో ఒకరు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచే యత్నాలు చేస్తున్నారు. ఉప్పల్ సీటు దక్కని మాజీ మునిసిపల్ చైర్మన్ మేకల శివారెడ్డి, గ్రేటర్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాగిడి లక్ష్మారెడ్డి సైతం పోటీకి దిగి సవాల్ విసిరే యోచనలో ఉన్నారు. తమను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీతో అమీతుమీ తేల్చుకుంటామని ఇరువురు నేతలు ప్రకటించారు. -
'అవినీతిపై హజారే కంటే ఎక్కువ పోరాటం చేశా'
విజయవాడ: ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై మాజీ మంత్రి పి. శంకర్రావు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నత్తి సీఎం కిరణ్, సత్తి బొత్సకు వచ్చే నెల 7 తర్వాత ఉద్వాస తప్పదని ఆయన జోస్యం చెప్పారు. విజయవాడలో దుర్గా మల్లేశ్వరి అమ్మవారిని మంగళవారం ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సీఎం కిరణ్ పార్టీ పెడితే పార్టీ పాతాళానికి, అందులో చేరినవారు కైలాసానికి వెళ్తారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికలు రెండు రాష్ట్రాల్లో జరుగుతాయని అన్నారు. అవినీతిపై అన్నా హజారే కంటే తానే ఎక్కువ పోరాటం చేశానని ఆయన సొంత డబ్బా కొట్టుకున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న మూడేళ్ల కాలంలో పార్టీని భూస్థాపితం చేయడం తప్ప కిరణ్ కుమార్ రెడ్డి సాధించిందేమీలేదని అంతకుముందు శంకర్రావు అన్నారు. కిరణ్ కంటే తానే బెటర్ అని కూడా వ్యాఖ్యానించారు. -
సోనియా... తెలంగాణ తల్లి: శంకర్రావు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో ఆయనదో విభిన్న శైలి. వింత వైఖరుల, విచిత్ర వ్యాఖ్యలతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారాయన. ఒక్కోసారి ఆయన మాటలు, చేష్టలు హాస్యాస్పదంగానూ అన్పిస్తుంటాయి. ఆయన మరెవరో కాదు రాష్ట్ర మాజీ మంత్రి పి.శంకర్రావు అలియాస్ శంకరన్న. అధిష్టానమ్మ సోనియా గాంధీని స్తుతించడంలోనూ ఆయనది ప్రత్యేక శైలి. 'మేడమ్' వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడబోతోందని శంకర్రావు గట్టిగా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో సోనియా భజన ముమ్మరం చేశారు. సోనియాను తెలంగాణ దేవతగా వర్ణిస్తూ ఆమెకు ఆలయం కట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి సోనియా పేరు పెట్టాలంటూ శంకర్రావు కొత్త పాట అందుకున్నారు. త్వరలో ఏర్పాటు కానున్న కొత్త రాష్ట్రానికి 'సోనియా తెలంగాణ' అని నామకరణం చేయాలని ఆయన కోరుతున్నారు. అధిష్టానమ్మను ఆయన తెలంగాణ తల్లిగా వర్ణించారు. శంకర్రావు వీర విధేయతపై 'మేడమ్' ఎలా స్పందిస్తారో చూడాలి. -
కిరణ్ వ్యాఖ్యల్లో నిజం లేదు: శంకర్రావు
కిరణ్.. సీమాంధ్ర సీఎంలా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి శంకర్రావు విమర్శించారు. అధిష్టానం నిర్ణయానికి కాంగ్రెస్ నేతలంతా కట్టుబడి ఉండాలని ఆయన కోరారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు సెలవిస్తారన్న సీఎం వ్యాఖ్యల్లో నిజం లేదని అన్నారు. 1955 నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ ఓటు శాతం 30శాతం పైనే ఉందని తెలిపారు. చంద్రబాబు రెండు నాల్కల ధోరణితో వ్యవహిస్తున్నారని శంకర్రావు దుయ్యబట్టారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించిన చంద్రబాబు.. ఇప్పుడు సీమాంధ్ర ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకే మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) మద్దతు ఇస్తుందని శంకర్రావు అంతకుముందు చెప్పారు. బీజేపీ నేతలకు తెలంగాణపై మాట్లాడే హక్కు లేదని అన్నారు.