కిరణ్.. సీమాంధ్ర సీఎంలా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి శంకర్రావు విమర్శించారు.
కిరణ్.. సీమాంధ్ర సీఎంలా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి శంకర్రావు విమర్శించారు. అధిష్టానం నిర్ణయానికి కాంగ్రెస్ నేతలంతా కట్టుబడి ఉండాలని ఆయన కోరారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు సెలవిస్తారన్న సీఎం వ్యాఖ్యల్లో నిజం లేదని అన్నారు. 1955 నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ ఓటు శాతం 30శాతం పైనే ఉందని తెలిపారు.
చంద్రబాబు రెండు నాల్కల ధోరణితో వ్యవహిస్తున్నారని శంకర్రావు దుయ్యబట్టారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించిన చంద్రబాబు.. ఇప్పుడు సీమాంధ్ర ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకే మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) మద్దతు ఇస్తుందని శంకర్రావు అంతకుముందు చెప్పారు. బీజేపీ నేతలకు తెలంగాణపై మాట్లాడే హక్కు లేదని అన్నారు.