![సీసీ రెడ్డి కుటుంబానికి షర్మిల పరామర్శ](/styles/webp/s3/article_images/2017/09/2/81412795019_625x300.jpg.webp?itok=nlTcbikA)
సీసీ రెడ్డి కుటుంబానికి షర్మిల పరామర్శ
సాక్షి,సిటీబ్యూరో: చలన చిత్ర నిర్మాత సీసీ రెడ్డి కుటుంబసభ్యులను దివంగత సీఎం వైఎస్సార్ కుమార్తె షర్మిల, ఆమె భర్త అని ల్‌కుమార్ పరామర్శించారు. బుధవారం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ఏ ర్పాటు చేసిన చిత్రపటం వద్ద వారు శ్రద్ధాం జలి ఘటించారు. అనంతరం సీసీ రెడ్డి భా ర్య సుభద్రమ్మను ఓదార్చారు. అనంతపు రం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కూడా సీసీ రె డ్డి నివాసానికి చేరుకొని సీసీ రెడ్డి కుటుం బీకులను పరామర్శించారు. సీసీ రెడ్డి దగ్గర 20 ఏళ్లుగా పనిచేస్తున్నానని ఆయన సహచరుడు అనంతపురం జిల్లా ఓడీ చెరువుకు చెందిన బి. నాగరాజు కన్నీటి పర్యంతమయ్యారు.
నేడు అంత్యక్రియలు..
సీసీ రెడ్డి భౌతికకాయాన్ని కేర్ హస్పిటల్ నుంచి గురువారం ఉదయం 7 గంటలకు జూబ్లీహిల్స్, రోడ్ నంబర్ 24లోని, ప్లాట్ నంబర్ 366కు తీసుకువస్తామని సమీపబంధువు వై.సురేష్ కుమార్ రెడ్డి తెలిపా రు. అంత్యక్రియలను మధ్యాహ్నం 12 గం టల తర్వాత పటాన్ చెరువు నుంచి ముం బయి హైవే మార్గంలోని మునిపల్లి మండ లం గొర్రెగట్టు గ్రామం సమీపంలోని ఫాంహౌస్(శివశివాని ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర)లో నిర్వహిస్తారని చెప్పారు.