చిన్నారిని చిదిమేసిన కారు | Sheikh Isaan passed away | Sakshi
Sakshi News home page

చిన్నారిని చిదిమేసిన కారు

Published Tue, Dec 16 2014 2:33 AM | Last Updated on Sat, Sep 2 2017 6:13 PM

చిన్నారిని చిదిమేసిన కారు

చిన్నారిని చిదిమేసిన కారు

ఖానాపూర్ : అభం శుభం తెలియని ఆ చిన్నారిని కారు చిదిమేసింది. అప్పుడే నిద్రలేచి ఆరుబయట ఉన్న మూడేళ్లు కూడా నిండని చిన్నారి బాలున్ని కారు రూపంలో మృత్యువు కబళించింది. ఎస్సై సునిల్ తెలిపిన వివరాల ప్రకారం..  కడెం మండల కేంద్రంలోని సుభాష్‌నగర్ కాలనీకి చెందిన నిరుపేద చిరు వ్యాపారి అయిన శేక్ మహ్మద్, పర్సానాబేగం దంపతులకు ఇద్దరు కుమారులు.

పెద్ద కుమారుడు వికలాంగుడు కాగా, చిన్న కుమారుడు శేక్ ఇసాన్(3). ఎప్పటిలాగే ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అదే సమయంలో కాలనీ నుంచి అతివేగంగా వస్తున్న కారు బాలున్ని ఢీకొట్టింది. కుటుంబ సభ్యులు బయటకు వచ్చి చూసే సరికి కొడుకు రక్తంమడుగులో ఉన్నాడు. తల, కాళ్లు, చేతులకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయాడు. కారు నడుపుతున్న శేక్ షకీల్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement