రామక్కపేట నిందితులను వెంటనే అరెస్టు చేయాలి | should be arrested immediately | Sakshi
Sakshi News home page

రామక్కపేట నిందితులను వెంటనే అరెస్టు చేయాలి

Published Wed, Oct 8 2014 12:18 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

రామక్కపేట నిందితులను వెంటనే అరెస్టు చేయాలి - Sakshi

రామక్కపేట నిందితులను వెంటనే అరెస్టు చేయాలి

నంగునూరు: దుబ్బాక మండలం రామక్కపేటలో తల్లీకూతుళ్లపై  అత్యాచారానికి పాల్పడిన నిందితులను అరెస్టు చేయడంలో పోలీసులు జాప్యం చేస్తున్నారని తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం మండల అధ్యక్షుడు దేవర నర్సింలు, ప్రధాన కార్యదర్శి మానుపాటి రాజు, కోశాధికారి శీలసాగరం రవీందర్, గౌరవ సలహాదారు దేవర మల్లయ్య ఆరోపించారు. మంగళవారం నంగునూరు మండల కేంద్రంలో ప్రదేశ్ ఎరుకల సంఘం, దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిందితులను అరెస్టు చేయాలంటూ ఆందోళన చేపట్టారు.
 
దసరా పండుగనాడు తల్లీకూతుళ్లపై అత్యాచారానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించి బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం దళితులకు న్యాయం చేసే విధంగా అధికారులకు, పోలీసులకు బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఆందోళన అనంతరం తహశీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. వీరికి ఎంఎస్‌ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు లింగంపల్లి యాదగిరి, ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఆరెపల్లి కనకయ్య, నంగునూరు మండల అధ్యక్షుడు దేవుపల్లి రాజమౌళి, జిల్లా నాయకుడు దేవులపల్లి కిష్టయ్య, బీసీ సంఘం నాయకులు కొమురయ్య, వడ్డెర సంఘం అధ్యక్షుడు యాదగిరి, మాల సంఘం అధ్యక్షుడు నర్సింలు  సంఘీభావం ప్రకటించారు.
 
నిందితులను అరెస్టు చేయాలి
దుబ్బాక రూరల్: రామక్కపేటలోని తల్లీ కూతళ్లపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని అఖిల భారత మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు ఆశలత డిమాండ్ చేశారు. మంగళవారం ఆమె బాధితులను పరామర్శించారు. అనంతరం ఆశాలత మాట్లాడుతూ స్వాతంత్య్రం సిద్ధించి 60 ఏళ్లు గడుస్తున్నా నేటికీ మహిళలపై అత్యాచారాలు జరగడం సిగ్గు చేటన్నారు. అత్యాచార ఘటనలో ఎనిమిది మంది నిందితులు పాల్గొన్నట్లు సమాచారం ఉన్నప్పటికీ పోలీసులు ముగ్గురిని మాత్రమే అదుపులోకి తీసుకోవడం శోచనీయమన్నారు. అత్యాచార ఘటనకు కారకులైన నిందితులపై నిర్భయ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయాలని డిమాండ్ చేశారు.  కార్యక్రమంలో ఐద్వా నేతలు నవీన, జమున, సీపీఎం డివిజన్ కార్యదర్శి గొడ్డుబర్ల భాస్కర్, నాయకులు చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  
 
‘నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదు’
రామక్కపేటలో తల్లీకూతుళ్లపై అత్యాచారం చేసిన నిందితులను ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదని తెలంగాణ ప్రజా ఫ్రంట్ ప్రశ్నించింది. మంగళవారం దుబ్బాకలో టీపీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పల్లె చంద్రం, జిల్లా కార్యదర్శి జంగిటి నర్సింలు మాట్లాడుతూ దళిత, ఆదివాసీల మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులు, హత్యలు సిగ్గుచేటన్నారు. అత్యాచార నిందితుల్లో ముగ్గురిని అరెస్టు చేసి, మరో ముగ్గురిని కేసు నుంచి తప్పించే యత్నం జరుగుతోందని వారు అనుమానం వ్యక్తం చేశారు. నిందితులందరిని అరెస్టు చేయకుంటే టీపీఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని  హెచ్చరించారు.  
 
నిందితులను తప్పించేందుకు కుట్ర
దుబ్బాక: దుబ్బాక మండలం రామక్కపేట గ్రామానికి చెందిన గిరిజన మహిళలపై అత్యాచారం చేసిన నిందితులను తప్పించడానికి కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ మెదక్ లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రావణ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యాచార సంఘటనలో నిందితులను నిర్భయ చట్టం కింద అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమంలో మెదక్ నియోజక వర్గ ఇన్‌చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, పెద్దగుండవెల్లి ఎంపీటీసీ సంజీవరెడ్డి, పోతారం మాజీ సర్పంచ్ సాందిరి బాలకిషన్, కాంగ్రెస్ నాయకులు కటికె బాల్‌రాజు, అనంతుల శ్రీనివాస్, సెంట్రింగ్ దుర్గయ్య, చెక్కపల్లి ప ద్మయ్య, కిష్టమ్మగారి కిష్టారెడ్డి, గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
 
బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి
రామక్కపేటకు చెందిన తల్లీకూతుళ్లపై అత్యాచారం చేసిన నిందితులను వెంటనే నిర్భయ చట్టం కింద అరెస్టు చేసి బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని రాష్ట్ర ఎరుకల ప్రజా సంఘం, తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం దుబ్బాక తహశీల్దార్ కార్యాలయంలో విజ్ఞాపన పత్రం అందజేశారు. ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి కుమార్ మాట్లాడుతూ అత్యాచార నిందితులపై నిర్భయ చట్టంతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
 
 బాధిత కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగంతోపాటు ఐదెకరాల వ్యవసాయ భూమి, నెలకు మూడు వేల రూపాయల పింఛన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు బాధిత కుటుంబానికి రూ. 10 వేల నగదును అందజేశారు.  కార్యక్రమంలో రాష్ట్ర కార్యరద్శి శ్రీనివాస్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎం. శ్యామల, నాయకులు వి. నాగార్జున, శేఖర్, నర్సింగారావు, వనం కనకయ్య, యాదగిరి, నిమ్మ పోశయ్య, నిమ్మ రాజు, నిమ్మ లచ్చయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement