భూసారం.. నిస్సారం..! | should be aware of soil tests | Sakshi
Sakshi News home page

భూసారం.. నిస్సారం..!

Published Sat, Jun 14 2014 3:42 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

భూసారం.. నిస్సారం..! - Sakshi

భూసారం.. నిస్సారం..!

 ఆదిలాబాద్ అగ్రికల్చర్ : రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు వ్యవసాయాధికారులు, ఆదర్శ రైతులు భూసార పరీక్షలపై అవగాహన కల్పించాలి. భూసారం దెబ్బతినకుండా, ఎరువుల వాడకం వల్ల నష్టాలపై వివరించాలి. మట్టినమూనాలు సేకరించి, పరీక్షలు జరిపి వాటి వివరాలు రైతులకు తెలియజేయాలి. కానీ, భూసార పరీక్ష కేంద్రాలు పరీక్షలకే పరిమితం అవుతున్నాయి.

పరీక్షలు చేసి రైతులకు తెలియజేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. సిబ్బంది వ్యవసాయధికారులకు తెలియజేసినా వారు రైతులకు తెలుపడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇంకా భూసార పరీక్ష కేంద్రాల సిబ్బంది సెల్ మెసేజ్ రూపకంగా తెలియజేస్తున్నారు. సెల్‌ఫోన్ లేక కొందరు రైతులకు సమాచారం అందడం లేదు. కొందరు నిరక్ష్యరాస్యులు కావడంతో తెలియక పాతపద్ధతిలోనే సాగు చేస్తున్నారు. దిగుబడులు రాక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
 
శాంపిళ్ల లక్ష్యం 11,500
ఈ ఖరీఫ్ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 6.50 లక్షల హెక్టార్లకు పైగా వివిధ పంటలు సాగు అవుతాయని అధికారులు అంచనా వేశారు. పత్తి సుమారు 3.90 లక్షలు, సోయా 1.25 లక్షలు, వరి 60 వేలు, కందులు 50 వేలు, జొన్న 27 వేలు,  మొక్కజొన్న 15 వేలు, పెసళ్లు 11 వేలు, మినుములు 10 వేల హెక్టార్లలో సాగు అవుతాయని అంచనా వేశారు. ఖరీఫ్, రబీ పంట కాలానికి సంబంధించి 10,300 నమూనాలు సేకరించారు. ఇప్పటివరకు 520 పరీక్షలు నిర్వహించి రైతులను సెల్ మెసేజ్ రూపంలో పంపించారు. ఇందులో ఖరీఫ్‌లో 6,500, మిగతావి రబీ సీజన్‌కు పరీక్షించి సేద్యానికి ముందే ఫలితాలు అందించాలి. ఖరీఫ్‌కు ముందే అందించాల్సిన నమూనా ఫలితాలు రైతులకు చేర డం అసాధ్యంగా కనిపిస్తుంది.
 
జిల్లాలో భూసార కేంద్రాలు
 జిల్లాలో ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల్, ఇంద్రవెల్లిలో భూసార పరీక్ష కేంద్రాలున్నాయి. వీటిలో ఆదిలాబాద్ మినహ మిగత కేంద్రాలు తెరుచుకోవడం లేదు. తగిన సిబ్బంది, అధునాతన పరికరాల కొరతతో ఇవి పనిచేయడం లేదని పలువురు అధికారులే చెబుతున్నారు. దీంతో జిల్లాలో ఎక్కడా నమూనాలు సేకరించిన జిల్లా కేంద్రానికి పంపించాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లా కేంద్రంలోనూ ఇద్దరే అధికారులు ఉండటంతో జాప్యం జరుగుతోంది. దీంతో నమూనాలు హైదరాబాద్‌కు పంపించాల్సి వస్తుంది. దీంతో భూసార నమూనా పరీక్షల్లో జాప్యం జరుగుతుంది.
 
భూసార పరీక్షల ఫలితాల ద్వారానే పంటలు వేయాలి..  - మంత్రి జోగురామన్న
జిల్లాలో ఖరీఫ్, రబీ పంటలు సాగు చేసుకునే ముందు వ్యవసాయ భూమిలోని మట్టి నమూనాలను సేకరిం చి భూసార పరీక్షలు చేయించుకొని వాటి ఫలితాల అ ధారంగానే పంటలు వేసుకోవాలని రాష్ట్ర అటవీ, ప ర్యావరణశాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. రైతు లు వేసిన పంటనే వేస్తూ పంట మార్పిడి చేయకుండా పోటీ పడి ఎరువులు వేస్తూ పెట్టుబడి పెరిగి దిగుబడి తగ్గి నష్ట పోతున్నారు. జిల్లాలో నాలుగు కేంద్రాలు ఉ న్నాయని, మరిన్ని భూసార పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసి తగినంత సిబ్బందిని నియమించి అధునాతన పరీక్ష యంత్రాలను అందేలా చూస్తామని అన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement