
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకారవేతనాల విడుదల కోసం ఈనెల 28న బీసీ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి చేపట్టనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ తాజా మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య తెలిపారు. 2017–18 విద్యా సంవత్సరం ముగిసినా ఇప్పటికీ ఉపకారవేతనాలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం బకాయిలను విడుదల చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కలెక్టరేట్ల ముట్టడికి విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment