ఇల్లెందు: ఖమ్మం జిల్లాలో సింగరేణి రిటైర్డు ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇల్లెందు పట్టణంలోని కోరగుట్టలో బొల్లి మల్లేష్(59) పురుగుల మందు తాగి మరణించాడు. కుటుంబకలహాల నేపథ్యంలోనే ఆయన బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలానికి చెందిన మల్లేష్ సింగరేణిలో పనిచేసి రిటైరయ్యాడు. ప్రస్తుతం ఇల్లెందులో ఉంటున్నాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.