♦ రద్దయిన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పర్యటన
♦ సీఎం వరాల జల్లుపై ఆశలు.. అడి యూశలు
♦ తొలుత పాలేరు తొలగింపు..ఆ తర్వాత మొత్తానికే రద్దు
♦ జిల్లా పర్యటనన్న ప్రతిసారీ ఏదో ఒక అడ్డంకి...
♦ తీవ్ర జ్వరమే కారణమన్న మంత్రి తుమ్మల
♦ గోదారి పుష్కరాల అనంతరం సీఎం వస్తారని ప్రకటన
సారొస్తారనుకున్నారు.. సమస్యలు చెప్పుకుందామని నగర వాసులు సిద్ధమయ్యూరు.. ముఖ్యమంత్రి మన గల్లీల్లో తిరుగుతారని తెగ మురిసిపోయూరు.. సీఎం చంద్రశేఖరరావు పర్యటన తొలుత ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలను కుంటే.. అంతలోనే పాలేరు రద్దరుుంది. సరేలే..! ఖమ్మమైనా వస్తారనుకుని గురువారం నాటి పర్యటనకు అందరూ రెడీ అరుుపోయూరు. ఇంతలోనే టూర్ క్యాన్సిల్. జ్వరం కారణంగా కేసీఆర్ సారు రావట్లేదనే సమాచారంతో అందరిలోనూ నైరాశ్యం. ముఖ్యమంత్రి జిల్లా పర్యటనన్న ప్రతిసారీ ఏదో ఒక అడ్డంకి వస్తుండటం సర్వత్రా చర్చనీయూంశం.
- సాక్షిప్రతినిధి, ఖమ్మం
సాక్షిప్రతినిధి, ఖమ్మం : ‘తొలిసారి సీఎం కేసీఆర్ జిల్లా కేంద్రానికి వస్తుండటంతో అధికారుల హడావుడి.. షెడ్యూల్‌లో ఖమ్మం నగరంతో పాటు పాలేరు నియోజకవర్గం.. ఆ తర్వాత బుధవారం రాత్రికిరాత్రే పాలేరు తొలగింపు.. ఖమ్మం నగరం ఒక్కటే సీఎం పర్యటన.. సర్వం సిద్ధం చేసిన అధికారులు .. సీఎం రాక కోసం ఎదురుచూపులు.. వెలుగుమట్ల హెలిప్యాడ్ వద్దకు పరుగులు.. సీఎం టూర్ రద్దు అంటూ షెడ్యూల్ సమయానికి గంట ముందే జిల్లా యంత్రాంగానికి సమాచారం.’ ఇలా ముఖ్యమంత్రి పర్యటన రద్దు కావడంతో మళ్లీ ఎప్పుడు ఉంటుందోనని అధికారుల్లో హైరానా.. వరలా జల్లు కురిపిస్తారని ఆశించిన నగర ప్రజల్లో నైరాశ్యం. మొత్తానికి ముఖ్యమంత్రికి తీవ్ర జ్వరం రావడంతో జిల్లా పర్యటనకు ముహూర్తం కుదర్లేదట..సారొస్తే ఓ పని అరుుపోయేదే..మళ్లీ ఎప్పుడు వస్తారో ఏమో..అప్పటిదాకా టెన్షన్ పడాల్సిందేనా.. అంటూ అధికారులు నిట్టూర్చటం కనిపించింది.
వారుుదాలే వారుుదాలు..
భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగానే సీఎం కేసీఆర్ జిల్లాలో అడుగు పెట్టారు. ఈ పర్యటనలో భాగంగానే మణుగూరులో భద్రాద్రి విద్యుత్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత జిల్లా వైపు చూడలేదు. అయితే అప్పట్లో వారం రోజుల్లో ఖమ్మం నగరం వచ్చి.. రెండు, మూడు రోజులు ఇక్కడే ఉండి నగర అభవృద్ధికి మాస్టర్‌ప్లాన్ తయారు చేయిస్తానని ప్రకటించిన సీఎం..ఆ విషయమే మర్చిపోయూరు. శ్రీరామ నవమి నుంచి ఇప్పటి వరకు సీఎం జిల్లా పర్యటన పలుమార్లు వాయిదా పడింది. గురువారం నాటి పర్యటన కూడా రద్దు కావడంతో అధికారులు మలి పర్యటన ఎప్పుడోనని చర్చించుకున్నారు.
తెలంగాణలో హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో సీఎం పలుమార్లు పర్యటించారు. జిల్లాకు మాత్రం ఒక్కసారే రావడంతో ఖమ్మం అభివృద్ధిపై సీఎం నిర్లక్ష్యంగా ఉన్నారని ఓవైపు ప్రతిపక్ష పార్టీలు విమర్శలు ఎక్కుపెట్టాయి. గురువారం ఒక్కరోజు పర్యటనకు షెడ్యూల్ రూపొందించారు. మొదట రఘునాథపాలెంలోని వెలుగుమట్ల, రమణగుట్ట, ప్రకాశ్‌నగర్, పాలేరు నియోజకవర్గంలోని ఆరెంపుల, తిరుమలాయపాలెంను పేర్కొన్నారు. మొక్కలు నాటడడంతో పాటు రమణగుట్టలో నిరుపేదలతో మాట్లాడుతారని ప్రకటించారు. ఆ తర్వాత పాలేరు నియోజకవర్గాన్ని షెడ్యూల్ నుంచి తొలగించారు.
సీఎం జిల్లా పర్యటన తర్వాత వరంగల్ జిల్లా పర్యటన ఉన్నందున సమయం సరిపోదని పాలేరును తొలగించినట్లు టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. అయితే పోడు భూములపై వామపక్షాలు ఆందోళన చేస్తూ సీఎం కాన్వాయ్‌ను అడ్డుకంటాయన్న ఉద్దేశంతోనే పాలేరును షెడ్యూల్ నుంచి తొలగించినట్లు సమాచారం. చివరకు వెలుగుమట్ల, ఖమ్మం నగరం ఒక్కటే టూర్ షెడ్యూల్‌లో ఉన్నా అదీ రద్దు కావడం గమనార్హం.
ఎదరుచూసి.. వెనుదిరిగి
రమణగుట్టలో నివాసం ఉంటున్న నిరుపేదలు మంచినీరు, విద్యుత్, డ్రైనేజీ, వీధి దీపాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూరికికూపంలా ఉన్న ఈ ప్రాంతం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రాజీవ ఆవాస్ యోజన పథకం జాబితాలోకి కూడా ఎక్కింది. ఇక్కడ సమస్యలను సీఎం నేరుగా చూడడంతో పాటు కొంతమంది పేదలతో మాట్లాడుతారని ప్రకటించడంతో ఇక తమ సమస్యలకు మోక్షం కలుగుతుందని ఆశించారు.షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలకు రమణగుట్టలో సీఎం పర్యటన ఉంది. అయితే సీఎం రావడం లేదని అప్పటి వరకు ఎదురుచూసిన ప్రజలు నిరాశతో వెనుదిరిగి వెళ్లారు.
మళ్లీ ఎప్పుడో..?
ప్రస్తుతం సీఎం పర్యటన రద్దు కావడంతో మళ్లీ ఎప్పుడు ఉంటుందోనని చర్చ జరుగుతోంది. పుష్కరాల అనంతరం జిల్లాకు సీఎం వస్తారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించినా ఇప్పట్లో లేనట్లేనని సమాచారం. కార్పొరేషన్ ఎన్నికలే లక్ష్యంగా సీఎం పర్యటన కొనసాగే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నగరంలో రెండు, మూడు రోజుల పాటు సీఎం ఇక్కడే ఉండి.. ఖమ్మంపై వరాల జల్లు కురిపిస్తారని సమాచారం. అప్పటి వరకు జిల్లాలో సీఎం అడుగుపెట్టరని అంటున్నారు. పుష్కరాలకు సీఎం జిల్లాకు వచ్చినా మళ్లీ భద్రాచలానికే పరిమితం కావచ్చని భావిస్తున్నారు. వచ్చేనెల లేదా సెప్టెంబర్‌లో సీఎం పర్యటనకు ప్లాన్ చేసే అవకాశం ఉంది.
మొక్కలు నాటిన మంత్రి, అధికారులు..
ముఖ్యమంత్రి పర్యటన రద్దు కావడంతో ఉదయం 11.30 గంటలకు వెలుగుమట్ల అటవీ భూములకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు చేరుకొని మొక్కలు నాటారు. లకారం చెరువు పనులను పరిశీలించారు. ‘తీవ్ర జ్వరం, జలుబుతో బాధపడుతున్నందు వల్లే సీఎం కేసీఆర్ జిల్లా పర్యటన వాయిదా పడింది’ అని మంత్రి తుమ్మల మీడియూకు తెలిపారు. గోదావరి పుష్కరాలు ముగిసిన అనంతరం జిల్లా పర్యటనకు సీఎం వస్తారన్నారు. మొక్కలు నాటిన కార్యక్రమంలో రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్‌తివారీ, హరితహారం ఇన్‌చార్జి ప్రియాకం వర్గీస్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ భూపాల్‌రెడ్డి, అటవీ సంరక్షణ ముఖ్య అధికారి అజయ్‌మిశ్రా, డీఐజీ మల్లారెడ్డి, కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి ఉన్నారు.
సార్ రాలే..!
Published Fri, Jul 10 2015 4:20 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM
Advertisement
Advertisement